Viral Video: 19 వ అంతస్థు.. తలకిందులుగా వేళాడుతున్న 82 ఏళ్ల మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-11-26T01:33:13+05:30 IST
బహుళ అంతస్థుల భవనంలో నివసిస్తున్న 82ఏళ్ల వృద్ధ మహిళ.. తాజాగా అదుపుతప్పి కిందకు జారిపడింది. అయితే ఆమె అదృష్టం బాగుంటడటంతో.. ప్రాణాలతో బయటపడింది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రా
ఇంటర్నెట్ డెస్క్: బహుళ అంతస్థుల భవనంలో నివసిస్తున్న 82ఏళ్ల వృద్ధ మహిళ.. తాజాగా అదుపుతప్పి కిందకు జారిపడింది. అయితే ఆమె అదృష్టం బాగుంటడటంతో.. ప్రాణాలతో బయటపడింది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
82ఏళ్ల వృద్ధరాలు కొన్నేళ్లుగా బహుళ అంతస్థుల భవనంలో నివసిస్తోంది. ఎప్పటిలాగే బాల్కానీలోకి వచ్చిన ఆమె.. అదుపుతప్పి కిందకు జారిపడింది. ఈ క్రమంలో బట్టలు ఆరేసే ర్యాక్కు ఆమె చిక్కుకుని ప్రమాదకరంగా తలకిందులుగా వేలాడింది. వృద్ధురాలు తలకిందులుగా వేలడటాన్ని గమనించిన స్థానికులు.. ఫైర్‌ఫైటర్లకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా.. కొద్దిసమయం వరకు శ్రమించి.. ఆమె ప్రాణాలను కాపాడారు. వృద్ధ మహిళకు ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ.. ఆమెను అదృష్టవంతురాలిగా అభివర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు.