ఫ్లోరిడాలో కరోనా కాటుకు ఆరేళ్ల చిన్నారి మృతి!

ABN , First Publish Date - 2020-08-23T00:38:54+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను ఈ మహమ్మారి వణికిస్తోంది. అమెరికాలో కరోనా బారినపడి మృతి చెందుతున్న

ఫ్లోరిడాలో కరోనా కాటుకు ఆరేళ్ల చిన్నారి మృతి!

ఫ్లోరిడా: కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను ఈ మహమ్మారి వణికిస్తోంది. అమెరికాలో కరోనా బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఫ్లోరిడాలో కొవిడ్-19 విజృంభిస్తోంది. కాగా.. ఈ వారంలో కరోనా వైరస్.. ఓ ఆరేళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకుంది. ఈ విషయాని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడాలో కరోనా కాటుకు మరణించిన వారిలో అతిపిన్న వయస్కురాలు ఆ చిన్నారే అని అధికారులు తెలిపారు. ఈ ఆరేళ్ల చిన్నారి కాకుండా ఫ్లోరిడాలో ఇప్పటి వరకు దాదాపు ఏడుగురు పిల్లలు.. కరోనా కారణంగా మృత్యువాతపడ్డట్లు అధికారులు చెప్పారు. వారి వయసు 9-18ఏళ్ల మధ్య ఉందని ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు వివరించారు.  ఫ్లోరిడాలో ఇప్పటి వరకు దాదాపు 48వేల మంది పిల్లలకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇందులో సుమారు 600 మంది పిల్లలు ఆస్పత్రిలో చేరినట్లు వివరించారు. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలో శుక్రవారం ఒక్కరోజే దాదాపు 4,730 మంది కరోనా బారినపడ్డారు. ఇదే సమయంలో 119 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 5.93లక్షలకు చేరింది. మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,168కి చేరింది. 


Updated Date - 2020-08-23T00:38:54+05:30 IST