వీధికుక్కపై అత్యాచారం.. 40 ఏళ్ల వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-07-27T00:59:51+05:30 IST

అత్యాచారం కేసులు ఓ 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడు అత్యాచారం చేసింది స్త్రీపై కాదు.. ఓ వీధి కుక్కపై.....

వీధికుక్కపై అత్యాచారం.. 40 ఏళ్ల వ్యక్తి అరెస్టు

థానే: అత్యాచారం కేసులు ఓ 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడు అత్యాచారం చేసింది స్త్రీపై కాదు.. ఓ వీధి కుక్కపై.. మహారాష్ట్రలోని థానే నగరంలో చోటు చేసుకుంది ఈ ఘటన. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. వీధికుక్కలకు ఆహారం అందించే కొందరు యువకులు తమకు ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. ‘నిందితుడు అత్యాచారం చేస్తుండగా గమనించడంతో పట్టుకున్నట్లు యువకులు తెలిపారు. వారి కంప్లైంట్ మేరకు నిందితుడిని అరెస్టు చేశా’మని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై జంతు సంరక్షణ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ, నిందితుడిపై కంప్లైంట్ చేసేందుకు థానే పోలీస్ కమిషనర్‌ను కలిశామని, ఆయన ద్వారానే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు.

Updated Date - 2020-07-27T00:59:51+05:30 IST