SI Rashmi: స్కూల్ టీచర్ అయిన లవర్ కోసం భర్తకు కూడా విడాకులు.. ఈ మహిళా ఎస్‌ఐ లైఫ్ చివరికి..

ABN , First Publish Date - 2022-04-30T19:06:56+05:30 IST

రష్మీ యాదవ్ ఇన్‌స్పెక్టర్ కాకముందు బెహ్రైచ్ జిల్లాలో టీచర్‌గా పనిచేస్తున్న సురేంద్ర సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగా రష్మీ యాదవ్‌ కూడా అతనిని ఇష్టపడింది. అయితే అప్పటికే..

SI Rashmi: స్కూల్ టీచర్ అయిన లవర్ కోసం భర్తకు కూడా విడాకులు.. ఈ మహిళా ఎస్‌ఐ లైఫ్ చివరికి..

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న గొసైగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మలౌలీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన మున్నాలాల్ యాదవ్ కుమార్తె రష్మీ యాదవ్ మోహన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. ఆమె ఏప్రిల్ 22న ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత.. అంటే ఏప్రిల్ 24న విషయం వెలుగులోకి వచ్చింది. సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ రష్మీ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఈ ఘటనపై రష్మీ తండ్రి మున్నాలాల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో కొన్ని కీలక విషయాలను ఆయన పేర్కొన్నారు.



ఆ ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. రష్మీ యాదవ్ ఇన్‌స్పెక్టర్ కాకముందు బెహ్రైచ్ జిల్లాలో టీచర్‌గా పనిచేస్తున్న సురేంద్ర సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగా రష్మీ యాదవ్‌ కూడా అతనిని ఇష్టపడింది. అయితే అప్పటికే రష్మీ యాదవ్‌కు మరొకరితో పెళ్లైంది. అయినప్పటికీ భర్తకు తెలియకుండా సురేంద్ర సింగ్‌తో రష్మీ ప్రేమ నడిచింది. ఆమె అఫైర్ గురించి భర్తకు తెలియడంతో రష్మీకి విడాకులు ఇచ్చి ఆమె భర్త తనదారి తాను చూసుకున్నాడు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే దూరం చేసుకున్న రష్మీ యాదవ్‌కు కొన్నాళ్లకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ప్రియుడు సురేంద్ర సింగ్ రష్మీని వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన క్రమంలో నోటికొచ్చినట్టుగా బూతులు తిడుతూ భర్తను వదిలేశావంటూ నీచంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆమె క్యారెక్టర్‌ను తప్పుబడుతూ అవమానకరంగా మాట్లాడటంతో రష్మీ యాదవ్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది.



ఈ క్రమంలో ప్రియుడి సూటిపోటి మాటలు భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఆమె ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాక ఆమె మొబైల్‌ను చెక్ చేసిన తండ్రికి కొన్ని కాల్ రికార్డ్స్ కనిపించాయి. వాటిని వినగానే రష్మీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆమె ప్రియుడు సురేంద్ర సింగ్ అనే నిర్ధారణకు వచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ కాల్ రికార్డ్స్‌ను వారికి అందించాడు. నిందితుడు సురేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు రష్మీకి సురేంద్ర ఎక్కడ పరిచయమంటే.. రష్మీ సబ్‌ ఇన్‌స్పెక్టర్ కాకముందు బెహ్రైచ్‌లోని ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేది. అక్కడ అదే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న సురేంద్రతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి భర్తకు విడాకులిచ్చేంత వరకూ వ్యవహారం వెళ్లింది. చివరకు ఆమె జీవితం ఇలా విషాదాంతంగా ముగిసింది. మరో విషాదం ఏంటంటే.. డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన ఆమె యూనిఫామ్‌లో ఉండగానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Updated Date - 2022-04-30T19:06:56+05:30 IST