న్యూయార్క్‌లో 72ఏళ్ల తండ్రిపై కత్తితో దాడి చేసిన కసాయి కొడుకు

ABN , First Publish Date - 2020-05-22T21:11:39+05:30 IST

ఓ కసాయి కొడుకు కన్నతండ్రిని దారుణంగా పొడిచి చంపిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని సౌత్ ఓక్స్ హాస్పటల్ ప్రాంతానికి చెందిన థామ

న్యూయార్క్‌లో 72ఏళ్ల తండ్రిపై కత్తితో దాడి చేసిన కసాయి కొడుకు

న్యూయార్క్:  ఓ కసాయి కొడుకు కన్నతండ్రిని దారుణంగా పొడిచి చంపిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని సౌత్ ఓక్స్ హాస్పటల్ ప్రాంతానికి చెందిన థామస్ స్కల్లీ పవర్స్(32) అనే వ్యక్తి, తన తండ్రి డ్వైట్ పవర్స్‌(72)ను దారణంగా పొడిచి చంపాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం.. థామస్ స్కల్లీ పవర్స్ ఆయన తండ్రి డ్వైట్ పవర్స్ దాదాపు 20 మందితో ఆన్‌లైన్‌లో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో థామస్ స్కల్లీ పవర్స్.. తన తండ్రి డ్వైట్ పవర్స్‌పై ఉన్నట్టుండి కత్తితో దాడి చేసి, కిటికీ నుంచి పారిపోయాడు. కాగా.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్వైట్ పవర్స్‌.. అక్కడికక్కడే మృతి చెందాడు. వీడియో కాల్‌లో ఈ దారుణాన్ని చూసిన వాళ్లు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, థామస్ స్కల్లీ పవర్స్‌ కోసం గాలింపు ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత థామస్ స్కల్లీ పవర్స్.. పోలీసులకు చిక్కాడు. అయితే కిటికీ నుంచి దూకినప్పుడు థామస్‌ స్కల్లీ పవర్స్‌కు స్వలంగా గాయాలు కావడంతో అతడిని.. పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే థామస్‌ స్కల్లీ పవర్స్‌ను కస్టడీలోకి తీసుకోనున్నట్లు పోలీసులు వివరించారు. 


Updated Date - 2020-05-22T21:11:39+05:30 IST