ఈజి‌ప్ట్‌లో 3 వేల ఏళ్లనాటి నగరం

ABN , First Publish Date - 2021-04-11T06:59:40+05:30 IST

ఈజి్‌ప్టలో 3వేల ఏళ్ల క్రితం వైభవోపేతంగా వర్ధిల్లిన గొప్ప నగరం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ నగరానికి ‘ఆటెన్‌’ అని పేరు. లక్సర్‌ నగరానికి దక్షిణవైపు ఇసుక తిన్నెల కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఆటెన్‌కు సంబంధించి ఎన్నో

ఈజి‌ప్ట్‌లో 3 వేల ఏళ్లనాటి నగరం

క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో వర్ధిల్లిన ఆటెన్‌ సిటీ .. లక్సర్‌ సమీపంలో ఇసుక తిన్నెల కింద నగర అవశేషాలు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10: ఈజి్‌ప్టలో 3వేల ఏళ్ల క్రితం వైభవోపేతంగా వర్ధిల్లిన గొప్ప నగరం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ నగరానికి ‘ఆటెన్‌’ అని పేరు. లక్సర్‌ నగరానికి దక్షిణవైపు ఇసుక తిన్నెల కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఆటెన్‌కు సంబంధించి ఎన్నో ఆధారాలు లభించాయి. ఈజి్‌ప్టలో అత్యంత ప్రాచీనకాలం నాటి విశాలమైన పట్టణం ఇదే. పైగా క్రీస్తు పూర్వం 1391 నుంచి 1353 దాకా ఈజి్‌ప్టను ఏలిన రాజు తుతన్‌ఖామెన్‌కు సంబంధించిన సమాఽధిని 1922లో కనుగొన్న తర్వాత ఇదే అతిపెద్ద ఆధారం కూడా. సువిశాల ప్రాంతం మేర పరిపాలన, పారిశ్రామికంగా వర్ధిల్లిన నగరం ఆటెన్‌ అని.. అత్యంత అరుదైన పురాతన ఈజిప్షియన్ల నాణ్యమైన జీవన విధానానికి ఇది దర్పణమని పురావస్తు శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఆ నగర ఆనవాళ్లకు సంబంధించి గురువారం వారు వివరాలను వెల్లడించారు. ఆటెన్‌ నగరాన్ని అప్పటి రాజు అమెనోటెప్‌-3 స్థాపించారు. ఆయన తర్వాత రాజ్యానికి వచ్చిన ఆయన కుమారుడు ఆమెనోటెప్‌-4, మనుమడు తుతన్‌ఖామెన్‌ కాలంలో గొప్పగా వర్ధిల్లింది. 


పట్టణంలో వీధులన్నీ చక్కని ఇళ్లతో తళుక్కుమనేవి. వీటిలో కొన్ని ఇళ్ల గోడలైతే 10 అడుగుల ఎత్తుతో ఉండేవి. తవ్వకాల్లో లభ్యమైన నగలు, మధుపాత్రలు, ఉంగరాలు, మట్టితో చేసిన రంగురంగుల పాత్రలు, ఇటుకలన్నీ అందమైన చిత్రలిపితో ఉన్నాయి. ఇళ్లలో విశాలమైన వంట గదులు, వండేందుకు ఉపయోగించిన పొయ్యిలు, ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి వాడిన కుండలు లభించాయి. ఓ ఇంట్లోని గదిలో రెండు ఆవులు/ఎద్దులకు సంబంధించిన సమాధులున్నాయి. మరోచోట.. తనవైపు చేతులను ముడుచుకొని, కాళ్ల చుట్టూ తాడుతో బంధించిన మనిషి అస్థిపంజరాన్ని గుర్తించారు. పరిపాలన, నివాస ప్రదేశాల్లో ప్రవేశ మార్గాలను రక్షణ నిమిత్తం పలు మలుపులు తిరిగి ఉండేలా (జిక్‌జాక్‌గా) నిర్మించుకున్నారు. అలాగే ఓ వర్క్‌షా్‌పను గుర్తించారు. ఇక్కడ ప్రార్థనాస్థలాలు, సమాధుల్లో ఉపయోగించేందుకుగాను నగలు, తాయెత్తులను తయారుచేసేవారు. నూలు నేత, వడకడానికి సంబంధించిన పలు పరికరాలు, లోహ వస్తువులు, గాజుపాత్రలను తయారు చేసేందుకు ఉపయోగించిన తెట్టును కనుగొన్నారు. వెలుగు చూసిన ఆటెన్‌ నగర ఆవశేషాలను బట్టి పురాతన ఈజిప్షియన్ల జీవనవిధానానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను లభ్యమయ్యే అవకాశం ఉందని చారిత్రక నిపుణులు చెబుతున్నారు.  

Updated Date - 2021-04-11T06:59:40+05:30 IST