వారంలో కూతురి పెళ్లి.. అరగంటలో తిరిగి వస్తానని బయటికెళ్లిన కొడుకు.. అంతలోనే ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-11-01T22:16:18+05:30 IST

ఆ కుటుంబసభ్యులంతా పెళ్లి పనుల్లో మునిగిపోయారు. సిటీలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న కొడుకులు సొంతూరికి తిరిగివచ్చారు. దీంతో ఇల్లంతా సందడి సందడిగా మారింది. ఇంకో వారంలో కూతురి పెళ్లి ఉండడంతో

వారంలో కూతురి పెళ్లి.. అరగంటలో తిరిగి వస్తానని బయటికెళ్లిన కొడుకు.. అంతలోనే ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలిస్తే..

రాజస్థాన్: ఆ కుటుంబసభ్యులంతా పెళ్లి పనుల్లో మునిగిపోయారు. సిటీలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న కొడుకులు సొంతూరికి తిరిగివచ్చారు. దీంతో ఇల్లంతా సందడి సందడిగా మారింది. ఇంకో వారంలో కూతురి పెళ్లి ఉండడంతో తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆదివారం సాయంత్రం వారి చిన్న కుమారుడు.. బయట అర్జెంటు పని ఉందని, అర్ధగంటలో తిరిగివస్తానని వెళ్లాడు. అంతలోనే ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలిస్తే..


రాజస్థాన్‌లోని కరాడి గ్రామానికి చెందిన పారస్మల్‌కు ఆరుగురు సంతానం కాగా అందులో ఇద్దరు కూతుళ్లు, నలుగురు కొడుకులు ఉన్నారు. అయితే ఈ నెల 7న రెండో కూతురు దిల్‌కుష పెళ్లి ఉండడంతో కొడుకులందరూ సిటీ నుంచి సొంతూరికి వచ్చారు. ఈ క్రమంలోనే పూణెలో ఉంటున్న పారస్మల్ చిన్న కొడుకు 22 ఏళ్ల రాహుల్ చౌహాన్ రెండు రోజుల క్రితం ఊరొచ్చాడు. ఆదివారం అతడు అందరికీ పెళ్లి పత్రికలు ఇచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లాడు. అపుడు రాహుల్‌కు ఓ ముఖ్యమైన వ్యక్తికి పత్రిక ఇవ్వలేదని గుర్తు వచ్చింది. దీంతో అర్ధగంటలో వస్తానని చెప్పి కరాడి నుంచి బైక్‌పై బయలుదేరాడు. కుటుంబసభ్యులందరూ ఉదయం ఇవ్వొచ్చని చెప్పినా వినకుండా అతడు ఇంటినుంచి వెళ్లాడు. రాత్రి 7.30గం.లకు అతడిని బార్సారోడ్ వద్ద గుర్తతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే రాహుల్ ప్రాణాలు కోల్పోయాడు.


విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంవత్సరం క్రితం అంటే 20 సెప్టెంబర్, 2020న పారస్మల్ పెద్ద కొడుకు 26 ఏళ్ల రాజేంద్ర అలియాస్ రాజు సర్గర బార్సా దారిలో వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మళ్లీ ఏడాదికే రాహుల్ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోమవారం ఉదయం కుటుంబసభ్యులకు అందించారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది.

Updated Date - 2021-11-01T22:16:18+05:30 IST