Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. రాత్రి 35నిమిషాలపాటు కాబోయే భర్త‌తో ఫోన్‌లో మాట్లాడిన యువతి.. ఆ తర్వాత షాకింగ్ నిర్ణయం!

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు సుమారు 20ఏళ్లు. ఓ మంచి అబ్బాయిని చూసి.. తల్లిదండ్రలు ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఓ సంబంధం వచ్చింది. కూతురికి కూడా ఆ అబ్బాయి నచ్చడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరికీ పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కాబోయే భర్తతో బుధవారం రాత్రి సుమారు 35 నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడిన సదరు యువతి.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఉత్తరప్రదేశ్‌లోని మహోబా ప్రాంతానికి చెందిన 20ఏళ్ల నసీమా పర్బీన్‌కు పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. ఈ క్రమంలోనే ఓ పెళ్లి సంబంధాన్ని చూశారు. నసీమాకు అబ్బాయి నచ్చడంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే నసీమా బుధవారం రాత్రి తనకు కాబోయే భర్తకు ఫోన్ చేసి, సుమారు 35 నిమిషాలపాటు మాట్లాడింది. అనంతరం ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం నసీమా ఎంతకూ తన గది తలుపులు తెరవకపోవడంతో ఆమె తల్లి భయాందోళనలకు గురైంది.


విషయాన్ని ఇతర కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో తలుపులు బద్దలు కొట్టి.. వారు షాక్ అయ్యారు. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. తమకు కాబోయే అల్లుడే నసీమా ఆత్మహత్య చేసుకునేవిధంగా ప్రోత్సహించాడంటూ నసీమా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నసీమా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement