Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 22 2021 @ 17:26PM

28ఏళ్ల మహిళతో 17 ఏళ్ల కుర్రాడి వివాహేతర సంబంధం.. ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటంటే..

వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు నాశనమవుతుంటాయి. కొందరు ఇవన్నీ తెలిసి కూడా తప్పులు చేసి రోడ్డున పడుతుంటారు. ఇంకొందరైతే చిన్నా పెద్దా అనే తారతమ్యం మరిచి, అక్రమ సంబంధాలు పెట్టుకుని.. చివరకు కటకటాలపాలవుతూ ఉంటారు. బెంగళూరులో 17ఏళ్ల కుర్రాడు, 28ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. చివరికి అతడి పరిస్థితి ఏమైందో తెలుసుకుందాం.. 

బెంగళూరు బనశంకరిలోని యారబ్‌నగరలో అఫ్రినా ఖానం (28).. భర్త, పిల్లలతో నివాసం ఉంటోంది. టైలర్‌గా పని చేస్తున్న అఫ్రినా ఖానం ఇంటికి.. ఆమె బంధువైన విద్యార్థి(17) వస్తుండేవాడు. ఇటీవల ఆఫ్రినా ఇంటి పక్కనే విద్యార్థి కుటుంబం కొత్త ఇల్లు కట్టడం ప్రారంభించారు. దీంతో  రోజూ అఫ్రినా ఇంటికి రావడం మొదలెట్టాడు. ఈ క్రమంలో వారి పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. రోజూ వస్తుండడంతో మహిళ భర్తకు అనుమానం వచ్చింది.

దీంతో ఇంటి నుంచి పారిపోదామని అఫ్రినా ఒత్తిడి చేసింది. దీనికి విద్యార్థి ఒప్పుకోలేదు. రోజూ తనకు డబ్బులు కావాలని మహిళను వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో డబ్బుల కోసం ఒత్తిడి చేశాడు. తాను ఇవ్వనని చెప్పగా.. కోపంతో కత్తెర తీసుకుని మహిళపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ.. అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతురాలిపై దుస్తులను కుప్పగా పోసి, నిప్పు పెట్టి పరారయ్యాడు. మహిళ భర్త, బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయట పడింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement