Bachchi Don: కత్తులు పట్టుకుని ఫేస్‌బుక్‌లో ఫొటోలు.. డాన్ కావాలని కలలు.. 15 ఏళ్లకే ఒకరిని చంపేసిన యువతి కథ ఇదీ..!

ABN , First Publish Date - 2022-07-25T20:47:50+05:30 IST

రోడ్డుపై సైకిల్ నిలిపి ఉంచి తనకు దారి ఇవ్వలేదనే కారణంతో 40 ఏళ్ల వ్యక్తిని 15 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపిన ఘటన

Bachchi Don: కత్తులు పట్టుకుని ఫేస్‌బుక్‌లో ఫొటోలు.. డాన్ కావాలని కలలు.. 15 ఏళ్లకే ఒకరిని చంపేసిన యువతి కథ ఇదీ..!

రోడ్డుపై సైకిల్ నిలిపి ఉంచి తనకు దారి ఇవ్వలేదనే కారణంతో 40 ఏళ్ల వ్యక్తిని 15 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ (Raipur)లో సంచలనం సృష్టించింది. ఆ బాలిక గురించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాయ్‌పూర్‌లోని అజాద్ చౌక్ ప్రాంతంలో ఆదివారం సుదామ (40) అనే వ్యక్తి రోడ్డుపై సైకిల్ నిలిపి ఉంచాడు. అదే సమయంలో 15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి స్కూటర్ మీద వెళ్తోంది. సైకిల్ పక్కకు తీయమని హారన్ కొట్టింది. అయితే సుదామ బధిరుడు కావడంతో స్పందించలేదు. బాలిక కేకలు పెట్టినా అతను పట్టించుకోలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తన దగ్గర ఉన్న బటన్ నైఫ్ తీసి సుదామ గొంతు కోసి పారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గంటలోనే ఆ బాలికను అరెస్ట్ చేశారు. 


ఇది కూడా చదవండి..

ఉబ్బుతున్న పొట్ట.. కడుపు నొప్పంటూ కూతురు రెండ్రోజులుగా బాధపడుతోంటే ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. డాక్టర్లు చెప్పింది విని..


ఆ బాలిక గురించి సంచలన విషయాలు ప్రస్తుతం బయటపడుతున్నాయి. ఆమె మనస్తత్వం, ప్రవర్తన గురించి తెలుసుకుని పోలీసులే షాక్ అవుతున్నారు. బాలీవుడ్ చిత్రాల్లో కనిపించే గ్యాంగ్‌స్టర్‌గా, డాన్‌గా ఎదగాలనే కోరిక ఆ బాలికను తాజాగా కటకటాల వెనక్కి నెట్టింది. ఆ బాలికకు సంబంధించిన వీడియోలను పోలీసులు తాజాగా సేకరించారు. వాటిలో ఆమె హుక్కా పొగను ఊదుతూ, సిగరెట్ కాలుస్తూ కనిపిస్తోంది. కత్తులు, తుపాకులు పట్టుకుని వీడియోలు తీసుకుంది. మద్యం, డ్రగ్స్ తీసుకుంటూ కొన్ని వీడియోల్లో ఫోజులు ఇచ్చింది. రాయ్‌పూర్‌లోని లఖే నగర్‌లో ఇప్పటికే కొంతమందిని ఈ బాలిక బెదిరించినట్టు తెలుస్తోంది. 


పాఠశాలకు వెళ్లకుండా నగరంలోని కొంతమంది గూండాలు, రౌడీలు, క్రిమినల్స్‌తో కలిసి తిరుగుతోంది. అంతేకాదు ఆమె బాయ్‌ఫ్రెండ్స్‌లో చాలా మందిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ బాలికపై కూడా గతంలో కొన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బాలిక మైనర్ కావడంతో అన్ని విషయాలు బయటపెట్టలేమని రాయ్‌పూర్ అదనపు ఎస్పీ అభిషేక్ మహేశ్వరి చెప్పారు. 

Updated Date - 2022-07-25T20:47:50+05:30 IST