15 ఏళ్ల సోదరిపై..తమ్ముడు అఘాయిత్యం

ABN , First Publish Date - 2021-02-25T13:29:04+05:30 IST

15 ఏళ్ల బాలికపై ఆమె తమ్ముడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన సంఘటన కన్నియాకుమారి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక తండ్రి చెన్నైలో

15 ఏళ్ల సోదరిపై..తమ్ముడు అఘాయిత్యం

చెన్నై/ఐసిఎఫ్(ఆంధ్రజ్యోతి): 15 ఏళ్ల బాలికపై ఆమె తమ్ముడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన సంఘటన కన్నియాకుమారి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక తండ్రి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. బాలిక తల్లి దివ్యాంగురాలు కాగా, ఆమెకు 14 ఏళ్ల తమ్ముడున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉంటున్న తమ్ముడు అక్కపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో, ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి నిర్వహించిన వైద్యపరీక్షల్లో గర్భంతో ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో, చైల్డ్‌ లైన్‌ అధికారులు బాలికను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై కుళచ్చల్‌ మహిళా పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2021-02-25T13:29:04+05:30 IST