Apr 14 2021 @ 12:14PM

ఎ. ఆర్. రెహమాన్ ఆధ్వర్యంలో '99 సాంగ్స్' స్పెష‌ల్ కాన్‌స‌ర్ట్ ..!

ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ - ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌ కాంబినేష‌న్‌లో తాజాగా తెరకెక్కిన ప్రేమ‌క‌థా చిత్రం '99 సాంగ్స్'‌. ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ ఈ సినిమాలో జంట‌గా న‌టించారు. విశ్వేష్‌ కృష్ణ‌మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16 భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎ. ఆర్.  రెహమాన్ రైట‌ర్‌గా కూడా పని చేయడం విశేషం. ప్రస్తుతం ఉన్న జ‌న‌రేష‌న్‌కు త‌గ్గట్టు కొత్త డైరెక్ట‌ర్‌తో ఈ సినిమా చేయాలన్న ఆలోచనతోనే విశ్వేష్‌ కృష్ణ‌మూర్తిని దర్శకుడిగా ఎన్నుకున్నట్టు ఏ ఆర్ రెహమాన్ ఇటీవల వెల్లడించారు. కాగా ఈరోజు రాత్రి 9గంటల 9నిముషాలకి ఏ ఆర్ రెహమాన్ ఆద్వర్యంలో '99 సాంగ్స్' లైవ్ కాంటెస్ట్ గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ వేదికగా మేకర్స్ ప్రకటించారు. ఈ డిజిట‌ల్ కాన్‌స‌ర్ట్ జియో సావ‌న్‌లో లైవ్ ప్ర‌ద‌ర్శిత‌మ‌వనుంది. 

ఇక '99 సాంగ్స్'‌ సినిమాకు మెయిన్ సోల్ మ్యూజిక్‌. ఈ సినిమాను పాత ప్ర‌పంచం, కొత్త ప్ర‌పంచానికి మ‌ధ్య ఉన్న వేరియేష‌న్‌ను చూపించేలా తెర‌కెక్కించారు. '99 సాంగ్స్'‌ సినిమా మ్యూజిక్‌కు సంబంధించినదే అయినప్పటికి ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన అంశాలను చూపించబోతున్నారు. ఈ సినిమాలో  హీరో పాత్ర పాత త‌రానికి, కొత్త త‌రానికి మ‌ధ్య పడే సంఘ‌ర్ష‌ణని ఆసక్తికరంగా మలిచారు. ఈ పాయింట్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారట. జియో సంస్థ '99 సాంగ్స్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయ‌బోతున్నారు.