ఎన్నాళ్లకెన్నాళ్లకు..వందకన్నా తగ్గిన కరోనా కేసుల సంఖ్య
ABN , First Publish Date - 2020-10-25T06:48:03+05:30 IST
కొన్ని నెలలుగా జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకు వెయ్యికిపైగా నమోదైన కేసులు కొద్ది రోజులుగా వందల్లో నమోదవుతున్నాయి
98 పాజిటివ్‌లు నమోదు
188 మంది డిశ్చార్జి
నెల్లూరు (వైద్యం) అక్టోబరు 24 : కొన్ని నెలలుగా జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకు వెయ్యికిపైగా నమోదైన కేసులు కొద్ది రోజులుగా వందల్లో నమోదవుతున్నాయి. ఇటీవల వంద, రెండొందల కేసులు వస్తుండగా శనివారం 98 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు పాజిటివ్‌ల సంఖ్య వందకన్నా తక్కువ రావడం చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి. ఎలాంటి మరణాలు సంభవించలేదు. అలాగే పలు ఆసుపత్రుల్లో కోలుకున్న 188 మందిని అధికారులు డిశ్చార్జ్ చేశారు.