ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-05T02:22:45+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత నాలుగైదు రోజులుగా 7వేల లోపే కేసులు

ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత నాలుగైదు రోజులుగా 7వేల లోపే కేసులు నమోదవ్వగా ఇవాళ మాత్రం భారీగా కేసులు పెరిగిపోయాయి. ఏపీలో కొత్తగా 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 64,147 కరోనా టెస్టులు చేయగా 9,747 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపితే.. ఏపీ వ్యాప్తంగా మొత్తం కేసులు లక్షా 76 వేల 333కి చేరాయి. కరోనా కేసులే కాదు.. మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 67 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా నమోదైన మరణాల సంఖ్యతో కలిపితే మొత్తం 1604కి చేరింది.


అనంతపురం, తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇవాళ భారీగా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే గుంటూరు జిల్లాలో 12 మంది మృతి చెందారు. ఏపీలో 79,104 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకూ 95,625 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 6,953 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 21,75,070 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది.


ఏ జిల్లాలో ఎన్ని కేసులు..!?



Updated Date - 2020-08-05T02:22:45+05:30 IST