97.01శాతం పోలింగ్‌

ABN , First Publish Date - 2021-12-11T06:50:21+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. క్యాంప్‌ శిబిరాల నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రజా ప్రతినిధులతో నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు.

97.01శాతం పోలింగ్‌
సూర్యాపేటలో పోలింగ్‌ కేంద్రానికి మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి తరలివస్తున్న ఓటర్లు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి స్థానానికి భారీగా పోలింగ్‌ 

పార్టీ ఆదేశాలు బేఖాతరు చేసిన బీజేపీ, సీపీఎం ఓటర్లు 

కుమారుడి అంత్యక్రియలు నిర్వహించి ఓటేసిన ఎంపీటీసీ 

ఆపరేషన్‌ విపక్షం సక్సెస్‌, భారీ మెజార్టీ అంచనాలో గులాబీదళం


ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. క్యాంప్‌ శిబిరాల నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రజా ప్రతినిధులతో నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. సూర్యాపేటలో మంత్రి జగ దీ్‌షరెడ్డి తమ పార్టీ నేతలతో పోలింగ్‌ కేంద్రానికి తరలివచ్చారు. ఎప్పటికప్పుడు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విపక్షాల నుంచి అభ్యర్థులు బరిలో లేక పోవడం, స్వతంత్ర అభ్యర్థులు ప్రభావం  కనిపించకపోవడంతో అన్ని కేంద్రాల్లోనూ అధికార పార్టీ నేతల హవానే కనిపించింది. 



నల్లగొండ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఒకే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1271 ఓటర్లకు గాను 1233మంది ఓటుహక్కును వినియోగించుకోగా, 97.01 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అధికార పార్టీ మినహా ప్రతిపక్ష పార్టీలు పోటీలో లేకపోవడం, స్వతంత్రులే బరిలో ఉండటంతో పోలింగ్‌కు దూరంగా ఉండాలన్న ఆదేశాలను బీజేపీ, సీపీఎం నేతలు పలుచోట్ల ధిక్కరించి, పోలింగ్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా 19మంది ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన కుమారుడి పెళ్లి పనులతో, టీచర్స్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అమెరికాలో ఉండటంతో ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. ఎమ్మెల్యే తమ ఓటర్లతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయించారు. అధికార పార్టీ నేతలు ముందస్తుగా అనుకున్న మేర తమ ఓటర్లతో పోలింగ్‌ చేయించారు. ఆ తర్వాత ఆపరేషన్‌ విపక్షంలో భాగంగా కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించి ఓట్లు వేయించడంతో మధ్యాహ్నం 2గంటలకే పోలింగ్‌ శాతం ఏకంగా 83.63 శాతానికి చేరుకుంది. 


ఓటుకు రూ.లక్ష, ఒక చీర నజరానా

మొత్తం 1271 ఓట్లల్లో సుమారు 1000 ఓట్లు టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉన్నా, ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు పోటీకి దూరంగా ఉన్నా అధికార పార్టీ నేతలు తమ ప్రజా ప్రతినిధులను రెండు రోజుల పాటు ఎన్నికల శిబిరానికి తరలించిం ది. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఓటర్లను పాపికొండలు విహారయాత్రకు తీసుకెళ్లగా మిగిలిన 10 నియోజకవర్గా ల ఓటర్లను నియోజకవర్గాల వారీగా హైదరాబాద్‌లోని స్టార్‌ హోటళ్లలో ఎన్నికల క్యాంపు నిర్వహించారు. రెండు రోజుల పాటు మందు, విందు సదుపాయాలు కల్పించారు.పోలింగ్‌కు వచ్చే ముందు ప్రతి ఓటరుకూ రూ.లక్ష నగదు కవర్‌తో పాటు ఒకచీరను అందజేశారు. అధికార పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల బరిలో లేకపోవడం, ప్రచారం చేయకపోవడంతో విపక్ష ఓట్లను సైతం వేయించుకోవడంలో అధికార పార్టీ సఫలమైన ట్లు సమాచారం. అధికారపార్టీలోని అసంతృప్తిని సొమ్ముకునే అభ్యర్థి లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ ఓటర్లు మౌనంగా పార్టీ అభ్యర్థికే గంపగుత్తగా వేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా అధికార పార్టీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధిస్తారన్న ధీమా అధికార పార్టీ శిబిరంలో కనిపిస్తోంది. 


పోలింగ్‌ సరళిని పరిశీలించిన అధికారులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు సందర్శించి, పోలింగ్‌ సరళిని తెలుసుకున్నారు. నల్లగొండ ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సూర్యాపేట జిల్లా కోదాడలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పోలిం గ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ పమేలా సత్పథి పరిశీలించారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ నుంచి వెబ్‌కాస్టిం గ్‌ ద్వారా కలెక్టర్‌ పీజేపాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి పోలింగ్‌ సరళిని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి, ఎన్నికల పరిశీలకుడు అహ్మద్‌ నదీన్‌ పర్యవేక్షించారు. నల్లగొం డ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో పోలింగ్‌ కేంద్రంలో భద్రత ఏర్పాట్లను ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ పరిశీలించారు.  


విపక్షానికి రూ.50 వేలు

చౌటుప్పల్‌ టౌన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్లను అధికార పార్టీ నేతలకు లక్షముట్టగా, విపక్ష ఓటర్లకు సైతం నజరానా అందినట్లు తెలుస్తోంది. స్వపక్ష ఓటర్లకు రూ.లక్ష ఇచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు విపక్ష సభ్యులకు రూ.50వేలచొప్పున ముట్టజెప్పినట్లు సమాచారం.క్రాస్‌ ఓటింగ్‌ను నివారించేందుకే ఈఎత్తుగడ వేసినట్లు చర్చించుకుంటున్నారు. డబ్బులతో పాటు మగవాళ్లకు మద్యం బాటిళ్లు, మహిళలకు పట్టు చీరలు ఇచ్చినట్లు తెలిసింది. 


వద్దు లెండి...!

అధికార పార్టీ లక్షల్లో ఇస్తుండగా, స్వతంత్ర అభ్యర్థి నగేష్‌ కూడా తృణ మో,ఫలమో ఇద్దామనుకున్నట్లు సమాచారం. తనకు తోచినంతగా అన్నట్లు అభ్యర్థులకు రూ.5వేలు పంపించగా,వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. 


ఆపరేషన్‌ విపక్షం సక్సెస్‌

ఎన్నికల ప్రక్రియ మొదట్లో అధికార పార్టీలో కొందరి అసమ్మతి రాగం, స్వతంత్రులకు విపక్షాల్లోని నాయకుల మద్దతుతో అధికార టీఆర్‌ఎ్‌సలో కొం త ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి జగదీ్‌షరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పోలింగ్‌కు వారం రోజుల ముందు వరకు ఏ ఓటరునూ కదలించే పని పెట్టుకోలేదు. ముందస్తుగా కదిలిస్తే కోరికలు వెనకుండే అంతరంగాలకు అంతే ఉండదన్న ఆలోచనతో మౌనం వహించారు. ఆ తర్వాత పోలింగ్‌ వారం రోజుల ముందు నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశా లు నిర్వహించి, ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతను వివరిస్తూ వచ్చారు. అదే సమయంలో  ఆ సమావేశాల్లోనూ ఇతర అంశాలకు ఎక్కువ సమయం కేటాయించలేదు. ఆ తర్వాత ఆపరేషన్‌ విపక్షం చేపట్టారు. ముందుగా తన నియోజకవర్గంలో ప్రారంభించి, క్రమంగా అందరు ఎమ్మెల్యేలకు అదే మోడల్‌ను అనుసరించాల్సిందిగా సూచించారు. ఆపరేషన్‌ విపక్షం అనే అంశాన్ని పోలింగ్‌కు ఒకరోజు ముందు వేగం పెంచారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ ఓటర్లు ఎక్కువకాలం ఒకేచోట సమావేశం కాకుండా వివిధ ప్రాంతంలో ఎన్నికల శిబిరాలు, రెండు రోజులకే పరిమితం చేయడం అధికార పార్టీ ఎత్తుగడ వేశారు. పోలింగ్‌కు వచ్చే  ముందు రూ.లక్ష నగదును కవర్‌లో పెట్టి, కవర్‌పై ఓటరు పేరు రాసి దాంతో పాటు రూ.5వేల విలువైన చీరను ఓటర్లకు అందజేశారు. ఇదే సమయంలో అభ్యర్థులను బరిలో దింపే వరకు ఉత్సాహం చూపిన కాంగ్రెస్‌ దిగ్గజాలు ఆ తర్వాత ఈ అంశాన్ని వదిలేయడం టీఆర్‌ఎ్‌సకు లాభించింది. విపక్షం నుంచి నిరుత్సాహకర వాతావరణంతో అధికార పార్టీ ఓటర్లలో అసంతృప్తి అనే అంశం పూర్తిగా మరుగునపడింది. దీతో అధికార పార్టీ ఓటర్లు ముందస్తుగా ఓట్లు వేసి వెళ్లిపోగానే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బూత్‌ల వద్ద నిలబడి కాంగ్రెస్‌, బీజేపీ ఓటర్లకు ఫోన్లు చేయడం చివరి నిమిషంలో వారు వచ్చి ఓట్లు వేసి పోవడం కనిపించింది.  


ఏ పార్టీ ఓట్లు ఎటో 

ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ అనంతరం క్రాస్‌ ఓటింగ్‌పై చర్చ నడుస్తోంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఏ పార్టీ ఓట్లు క్రాస్‌ అవుతాయన్న లెక్కల్లో నేతలు ఉన్నారు. పార్టీల బలా బలాలు చూస్తే టీఆర్‌ఎ్‌సకు ఎక్స్‌అఫీషియోతో కలిపి 820, కాంగ్రెస్‌కు 384, బీజేపీకి 35, సీపీఎం 18, సీపీఐకి 5 ఓట్లు ఉండగా, స్వతంత్రులు 9 మంది ఉన్నారు. ఏడుచోట్ల ఖాళీలు ఉన్నాయి. 1259 ఓట్లు కాగా వీటికి 19 ఎక్స్‌అఫిషియో ఓట్లు జత కావడంతో ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల ఓట్ల సంఖ్య 1278 చేరింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఓట్లు ఎవరికి పడతాయి, టీఆర్‌ఎ్‌సలో అసమ్మతి రాగాల పరిస్థితి ఏమిటనేది, విపక్ష పార్టీలు ఏ వైపు మొగ్గుచూపాయన్నది ఈనెల 14న తేలనుంది. 


టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగిస్తుంది 

ఎంసీ కోటిరెడ్డి విజయం నల్లేరు మీద నడకే 

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓటు వేసిన మంత్రి జగదీ్‌షరెడ్డి 

నల్లగొండ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయదుందుభి మోగించబోతుందని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేసిన అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం నల్లేరు మీద నడకే అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో మంత్రి జగదీ్‌షరెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి బాసటగా నిలిచి సీఎం కేసీఆర్‌ నాయకత్వమే శరణ్యం అని మరోమారు ఉమ్మడి నల్లగొండ జిల్లా చాటుకోబోతుందని ఆయన అన్నారు. అందరి అంచనాలకు భిన్నంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని అన్నారు. విజ్ఞులైన ఓటర్లు కాంగ్రెస్‌ కుట్రలను పటాపంచలు చేశారని ఆయన తెలిపారు. ఒడ్డూపొడుగు బడి ఇంత లావు అంత లావు అని చెప్పుకోవడంతో పాటు 30 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నేతలు నేరుగా బీ-ఫాం ఇవ్వకుండా అభ్యర్థిని నిలబెట్టడమే అందుకు నిదర్శనమని ఆరోపించారు. దానిని గమనించిన విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం చివరి నిమిషంలో తమ ఓటును టీఆర్‌ఎ్‌సకే వేశారన్నారు. అటువంటి నేతల కుయుక్తులతో జిల్లా కాంగ్రె్‌సకు కంచుకోట అనుకున్నది కాస్తా మంచు కోటల్లా కరిగిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి తిరుగు లేదు... ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ వెంటే అనేందుకు ఈ ఎన్నికల ఫలితం దోహదపడుతుందన్నారు. పరుగులు పెడుతున్న అభివృద్ధిని జరుగుతున్న ప్రగతిని చూసి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వమే శరణ్యం అంటూ భావించి రాజకీయాలకు అతీతంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసిన ఓటరుకూ మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 



జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌ 

యాదాద్రి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల పో లింగ్‌ ప్రశాంతంగా జరిగింది. శుక్రవా రం జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 95.05 శాతం పోలింగ్‌ నమోదుకాగా, భువనగిరిలో 100శాతం నమోదైంది. ఎన్నికల సందర్భంగా పోలీసులు పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రాల్లోకి అనుమతించారు. కొవిండ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధుల సెల్‌ఫోన్లు, చేతిగడియారాలను లోపలికి అనుమతించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులకు అందజేసి ఓటింగ్‌కు వెళ్లారు. మొత్తం 106 ఓటర్లకు 91మంది ఓటింగ్‌లో పాల్గొనగా, 15 మంది ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. ముననుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఓటు ఉన్నప్పటికీ, ఆయన ఓటింగ్‌లో పాల్గొనలేదు. సీపీఎం, బీజేపీ నేతలు పార్టీ నిర్ణయం మేరకు ఓటింగ్‌లో పాల్గొనలేదు. టీఆర్‌ఎ్‌సతోపాటు పలువురు ఓటర్లు విదేశాలకు వెళ్లడం, అనారోగ్య కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. భువనగిరిలో సీపీఎం ఓటర్లు అధిష్ఠానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. టీఆర్‌ఎ్‌సకు చెందిన ఓటర్లు క్యాంపు నుంచి నేరుగా భువనగిరి, చౌటుప్పల్‌లోని పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. భువనగిరి పోలింగ్‌కేంద్రంలో ఆలేరు ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి కుడుదుల నగేష్‌ భువనగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిత్యం వినియోగదారులతో కళకళలాడే  రైతుబజారు, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మూసివేయడంతో వినియోగదారులు చాలామంది తెలియక మా ర్కెట్‌కు వచ్చి వెనుదిరిగారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ఓటర్లు నగరశివారులోని ఓరిస్టార్ట్‌ నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. వీరివెంటే స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీలోని సీనియర్‌ నేతలు ఉన్నారు. 


పోలింగ్‌ సరళి.. ప్రతి రెండు గంటలకు

8 నుంచి 10 గంటల వరకు 1.57ు

10 నుంచి 12 గంటల వరకు 42,88ు

12 నుంచి 2 గంటల వరకు 83,63ు

2 నుంచి 4 గంటల వరకు 97.01ు



పోలింగ్‌ హైలెట్స్‌

అనారోగ్యంతో మరణించిన తన కుమారుడి అంత్యక్రియలు నిర్వహించి పుట్టెడు దుఃఖంలోనూ నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం బాలాజీనగర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీ సీ బన్సీలాల్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సూర్యాపేటలో ఓ కౌన్సిలర్‌ తన ఓటును సెల్‌ఫోన్‌లో చిత్రీకరించబోగా పోలీసులు అడ్డుకున్నారు.  

అధికార పార్టీకి చెందిన 90 మంది ప్రజా ప్రతినిధులు హుజూర్‌నగర్‌లోని పోలింగ్‌ కేంద్రానికి క్యాంప్‌ నుంచి నేరుగా మూడు బస్సుల్లో వచ్చారు.

కోదాడలో 10గంటలవరకు ఒక్క ఓటు నమోదు కాలేదు.

కోదాడలో వీల్‌చైర్‌లో వచ్చి భీక్యాతండ ఎంపీటీసీ గుగులోతు రాజు ఓటు వేశారు.

భువనగిరిలో క్యాంప్‌ నుంచి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్‌ నేతలు ఓటు వేయాలని అభ్యర్థించారు. 

బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లికి చెందిన బీజేపీ ఎంపీటీసీ పకీర్‌ రాజేందర్‌రెడ్డి నోటికి నల్లరిబ్బన్‌ ధరించి ఓటింగ్‌లో పాల్గొన్నారు. 

భువనగిరిలో ఓటర్ల చేతిలో సెల్‌ఫోన్లతో పాటు చేతిగడియారాలున్నా అనుమతించలేదు.

ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా చౌటుప్పల్‌ పోలింగ్‌ కేంద్రంలోనే 15 మంది ఓటర్లు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. 

చౌటుప్పల్‌లో ఓటు వేయాల్సిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కుమారుడి పెళ్లి పనులతో హాజరుకాలేదు.

అమెరికాలో ఉండటంతో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు నిడమనూరు జడ్పీటీసీ రామేశ్వరి, కోదాడకు చెందిన కౌన్సిలర్‌ సామినేని ప్రమీల సైతం ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. 

దేవరకొండ డివిజన్‌లో ఒకేమండలం నుంచి ముగ్గురు కాం గ్రెస్‌ ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. 

సూర్యాపేటలో మంత్రి జగదీ్‌షరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

హుజూర్‌నగర్‌లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి ఓటువేశారు. 

Updated Date - 2021-12-11T06:50:21+05:30 IST