కరోనాపై గెలిచిన 96 ఏళ్ల బామ్మ

ABN , First Publish Date - 2020-07-10T08:04:39+05:30 IST

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరుకు చెందిన 96 ఏళ్ల బామ్మ కరోనాపై పోరాడి గెలిచింది. మొదటి నుంచి చక్కటి ఆరోగ్యంతో ఉం డటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడడం...

కరోనాపై గెలిచిన 96 ఏళ్ల బామ్మ

బెంగళూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరుకు చెందిన 96 ఏళ్ల బామ్మ కరోనాపై పోరాడి గెలిచింది. మొదటి నుంచి చక్కటి ఆరోగ్యంతో ఉం డటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడడం, అన్నింటికీ మిం చి మానసిక స్థైర్యం కోల్పోకపోవడం ఆమెను కరోనా యుద్ధం లో గెలిపించాయి. జూన్‌ 25న హిరియూరులోని కిరాణా దు కాణం నిర్వహకుడికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అతని తల్లి(96), భార్య, కుమారుడు, మరో బంధువుకు కూడా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా వైరస్‌ సోకినట్టు తేలింది. జిల్లా కొవిడ్‌ చికిత్సా కేంద్రంలో చికిత్స పొందిన వీరంతా గు రువారం డిశ్చార్జ్‌ అయ్యారు. వయోభారం కారణంగా తన తల్లి ఈ మహమ్మారి నుంచి కోలుకుంటుందో లేదో అని ఆం దోళన చెందానని ఆమె కుమారుడు వెల్లడించారు.  


Updated Date - 2020-07-10T08:04:39+05:30 IST