Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 21 2021 @ 19:45PM

95% మందికి పెట్రోల్ అవసరమే లేదు: ధరల పెరుగుదలపై బీజేపీ నేత వ్యాఖ్యలు

లఖ్‌నవూ: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై సమాధానం చెప్పమంటే దేశంలో మెజారిటీ ప్రజలకు అసలు పెట్రోల్ అవసరమే లేదని సమాధానం చెప్పి తీవ్ర విమర్శల పాలవుతున్నారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన మంత్రి ఉపేంద్ర తివారి. గురువారం రాష్ట్రంలోని జలౌన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ.. కార్లు, బైక్‌లు చాలా తక్కువ మంది వద్ద ఉన్నాయి. పెట్రోల్ ఆ తక్కువ మందికే అవసరం. దేశంలోని 95 శాతం జనాభాకు పెట్రోల్ అవసరమే లేదు. ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగుతున్నారు. వారికి దమ్ముంటే దేశ తలసరి ఆదాయం గురించి మాట్లాడమనండి. 2014కి ముందు ఈ దేశ తలసరి ఆదాయం ఎంత ఉండేదో, ఇప్పుడు ఎంత ఉందో చెప్పమనండి. మోదీ, యోగీ వల్ల దేశంలో తలసరి ఆదాయం రేటు గననీయంగా పెరిగింది’’ అని మంత్రి ఉపేంద్ర తివారి అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement