Kuwait: రెండు వేర్వేరు ప్రాంతాల్లో 95 మంది ప్రవాసులు అరెస్ట్.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2022-09-04T15:56:00+05:30 IST

ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులపై గత కొంతకాలంగా కువైత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior), స్థానిక పోలీసులతో కలిసి క్రమం తప్పకుండా సోదాలు నిర్వహిస్తోంది.

Kuwait: రెండు వేర్వేరు ప్రాంతాల్లో 95 మంది ప్రవాసులు అరెస్ట్.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

కువైత్ సిటీ: ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులపై గత కొంతకాలంగా కువైత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior), స్థానిక పోలీసులతో కలిసి క్రమం తప్పకుండా సోదాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా ప్రవాసులు (Expats) నివాసం ఉండే ప్రాంతాల్లో వరుస తనిఖీలతో వారికి ముచ్చెమటలు పట్టిస్తోంది. రెసిడెన్సీ, వర్క్ ,ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకోవడం చేస్తున్నారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది కువైత్. ఇదే కోవలో తాజాగా అల్ నయేం ప్రాంతంలో అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు నిర్వహించిన సెక్యూరిటీ సోదాల్లో 19 మంది వలసదారులను అరెస్ట్ చేశారు. వేర్వేరు దేశాలకు చెందిన ఈ 19 మంది నివాస, పని అనుమతి ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వీరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.


ఇదే విధంగా అల్ రాయ్ ప్రాంతంలోని ఫ్రైడే మార్కెట్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా దేశంలో ఉంటున్న 76 మంది వలసదారులను సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. ఇలా రెండు వేర్వేరు ప్రాంతాల్లో అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో శుక్రవారం ఒకేరోజు 95 మంది ప్రవాసులు పట్టుబడ్డారు.   

Updated Date - 2022-09-04T15:56:00+05:30 IST