రైతు భరోసా కింద రూ.94కోట్లు జమ

ABN , First Publish Date - 2022-05-17T08:01:30+05:30 IST

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు.

రైతు భరోసా కింద రూ.94కోట్లు జమ
సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి రోజా, ఎమ్మెల్యే చెవిరెడ్డి

రామచంద్రాపురం, మే 16 : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువుకట్టపై సోమవారం రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో 1,70,854మంది రైతులకు రూ94.07 కోట్లు రైతు భరోసా కింద అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ రఘునాథరెడ్డి మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల్లో ప్రతి నెలలో మొదటి శుక్రవారం పంటల సాగుపై తమ కమిటీ సలహాలను అందిస్తుందని వివరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ పంట విత్తినప్పటి నుంచి చేతికందే వరకు భరోసాతో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. ఎంపీలు గురుమూర్తి, రెడ్డెప్ప మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అని తెలిపారు. ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వరప్రసాద్‌,వెంకటేగౌడ,కలెక్టర్‌ వెంకట్రమణా రెడ్డి, తుడా కార్యదర్శి లక్ష్మి, ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, టీసీ ఢిల్లీరాణి, సింగిల్‌ విండో అధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T08:01:30+05:30 IST