ఫిబ్రవరి నెలలో 93 టీఎంసీల నీరు ఎత్తిపోత

ABN , First Publish Date - 2021-03-04T05:19:32+05:30 IST

ఫిబ్రవరి నెలలో 93 టీఎంసీల నీరు ఎత్తిపోత

ఫిబ్రవరి నెలలో 93 టీఎంసీల నీరు ఎత్తిపోత

మహదేవపూర్‌, మార్చి 3 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా క న్నెపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి ఫిబ్రవరి నెల వరకు 93 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 2019 జూన్‌ 21న పంప్‌హౌ్‌సను అధికారికంగా ప్రారంభించగా 2021 ఫిబ్రవరి 28 వరకు మొత్తం 598 రోజులు మోటార్లను నడిపారు. ఈ 20 నెలల వ్యవధిలో 93 టీఎంసీల నీటిని సరస్వతీ బ్యారేజిలోకి ఎత్తిపోశారు. బుధవారం ఒక మోటారును నడుపుతూ 2100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. 

Updated Date - 2021-03-04T05:19:32+05:30 IST