బాప్‌రే! బీఎస్‌ఎన్ఎల్, ఎంటీఎన్‌ఎల్ నుంచి 93 వేల మంది బయటకి!

ABN , First Publish Date - 2020-02-15T02:14:26+05:30 IST

ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్

బాప్‌రే! బీఎస్‌ఎన్ఎల్, ఎంటీఎన్‌ఎల్ నుంచి 93 వేల మంది బయటకి!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) దాదాపు ఖాళీ కాబోతున్నాయి. ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థల నుంచి స్వచ్ఛందంగా బయటకు వెళ్లిపోయేందుకు ఉద్యోగులు క్యూకట్టారు. ఈ రెండు సంస్థలకు చెందిన దాదాపు 93,000 మంది ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీమ్ (వీఆర్ఎస్) ఎంచుకున్నట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. 


వీఆర్ఎస్ ఎంచుకున్న వారిలో 78,569 మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కాగా, 14,400 మంది ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు ఉన్నారు. వీఆర్ఎస్ ఎంచుకున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల్లో అత్యధిక మంది నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు. వీరి వయసు 55-60 ఏళ్ల మధ్య ఉంది.


‘‘దాదాపు 93 వేల మంది వీఆర్ఎస్ ఎంచుకున్నారు. విశేషం ఏమిటంటే ఈ విషయంలో ఒక్క కోర్టు కేసు కూడా లేదు. వీఆర్ఎస్ వల్ల బీఎస్ఎన్ఎల్ వేతనాలు 50 శాతం తగ్గనుండగా, ఎంటీఎన్ఎల్ వేతనాల ఖర్చు 75 శాతం తగ్గనుంది. ప్రస్తుతం ఉద్యోగుల వార్షిక వేతన ఖర్చులు దాదాపు రూ.1300 కోట్లుగా ఉంది. ఇప్పుడిది రూ. 650 కోట్లకు తగ్గనుంది’’ అని టెలికం డిపార్ట్‌మెంట్ (డీవోటీ) అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-02-15T02:14:26+05:30 IST