75 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ వెళ్లిన భారతీయ మహిళ.. 92 ఏళ్ల వయసులో ఆ బామ్మ ఎందుకు వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2022-07-19T01:33:02+05:30 IST

ఆ మహిళ పేరు రీనా చిబర్‌.. వయసు 92 ఏళ్లు.. దేశ విభజన సమయంలో ఆమె Pakistan నుంచి 15 ఏళ్ల వయసులో భారత్‌కు వచ్చేసింది..

75 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ వెళ్లిన భారతీయ మహిళ.. 92 ఏళ్ల వయసులో ఆ బామ్మ ఎందుకు వెళ్లిందంటే..

ఆ మహిళ పేరు రీనా చిబర్‌.. వయసు 92 ఏళ్లు.. దేశ విభజన సమయంలో ఆమె Pakistan నుంచి 15 ఏళ్ల వయసులో భారత్‌కు వచ్చేసింది.. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది.. చిన్న వయసులో తను గడిపిన ఊరిని చూడాలని, పూర్వీకులను కలవాలని ఆమె ఎప్పట్నుంచో అనుకుంటోంది.. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆమె పాకిస్తాన్‌ హై కమిషన్‌ నుంచి ఇటీవల వీసా పొందింది.. దాదాపు 75 ఏళ్ల తర్వాత ఆమె ఇటీవల పాకిస్తాన్ వెళ్లింది. 


ఇది కూడా చదవండి..

ఆరేళ్ల బాలిక.. స్కూల్ బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా ఘోరం.. బస్సు తలుపులు తెరిచి ఉండటంతో..


1947 దేశ విభజన తర్వాత రీనా అనే మహిళ 15 ఏళ్ల వయసులో పాక్ నుంచి భారత్‌కు వలస వచ్చింది. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటోంది. 1965లో ఆమె పాకిస్తాన్‌లో ఉంటున్న తన పూర్వీకుల ఇంటిని సందర్శించాలనుకుని వీసా కోసం దరఖాస్తు చేసింది. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆమెకు వీసా లభించలేదు. ఆ తర్వాత ఆమె ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆమెకు వీసా రాలేదు.


పలుకుబడి కలిగిన వ్యక్తులను కలిసి వారి సహాయ సహకారాలతో రీనా ఎట్టకేలకు పాకిస్తాన్‌ హై కమిషన్‌ నుంచి వీసా పొందగలిగింది. దీంతో ఆమె పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ప్రేమ్‌నివాస్‌లో ఉన్న తన పూర్వీకుల ఇంటిని చూసేందుకు శనివారం వాఘా అట్టారీ సరిహద్దులను దాటి వెళ్లింది. తన పూర్వీకులు ఇంటిని, స్నేహితులను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని రీనా చెప్పింది.

Updated Date - 2022-07-19T01:33:02+05:30 IST