కొవిడ్‌ ఉద్యోగులకు ఉద్వాసన

ABN , First Publish Date - 2021-10-24T05:39:06+05:30 IST

వారంతా కరోనా మహమ్మారిని తుదముట్టిచేందుకు మేము సైతం అంటూ ముందుకొచ్చారు. కరోనా సోకిన వారిని సొంత రక్త సం బంధీకులు, కుటుంబ సభ్యులే దూరం పెట్టినా మేమున్నామంటూ భరోసా ఇచ్చి ధైర్యం కల్పించారు. ఆపత్కాలంలో వైద్య సేవలు అందించారు. అయితే ఇప్పుడు

కొవిడ్‌ ఉద్యోగులకు ఉద్వాసన

కరోనా కట్టడికి తాత్కాలిక ఒప్పందంపై 

వైద్య ఆరోగ్యశాఖలో 1034 మంది నియామకం 

ఆరు నెలల గడువు తీరిందని ఉద్వాసన   

తొలి విడతలో 90 మంది ఇంటికి

కరోనా కష్టకాలంలో పని చేయించి ఇప్పుడు పొమ్మంటారా

ఉద్యోగుల ఆవేదన 

కడప (ఆంధ్రజ్యోతి), అక్టోబరు 23: వారంతా కరోనా మహమ్మారిని తుదముట్టిచేందుకు మేము సైతం అంటూ ముందుకొచ్చారు. కరోనా సోకిన వారిని సొంత రక్త సం బంధీకులు, కుటుంబ సభ్యులే దూరం పెట్టినా మేమున్నామంటూ భరోసా ఇచ్చి ధైర్యం కల్పించారు. ఆపత్కాలంలో వైద్య సేవలు అందించారు. అయితే ఇప్పుడు కుదుర్చుకు న్న ఒప్పందం గడువు ముగిసింది ఇక మీరు ఇంటికెళ్లండంటూ ప్రభుత్వం చెబుతోంది. ఆపత్కాలంలో మాతో పని చేయించుకొని ఇప్పుడు వెళ్లిపొమ్మంటారా అంటూ ఆ ఉ ద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు ఉన ్న వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాలో మార్చి నుంచి మొ దలైంది. మొదటి వేవ్‌ కన్నా సెకండ్‌ వేవ్‌లో కరోనా తీవ్ర రూపం దాల్చింది. ఒక్కొక్క దశలో కేసులు 2000 మార్కు దగ్గరకి వచ్చేశాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖలో తాత్కాలిక ఉద్యోగాల పేరిట 1034 మందిని నియమించుకుంది. వీరిలో డాక్టర్లు, ఏఎనఎంలు, ట్రైనీ నర్సులు, ఆపరేటర్లు, అనస్తీషియా, ఇతర టెక్నీషన్సను నియమించింది. కడప రిమ్స్‌, ఫాతిమ హాస్పిటల్‌, ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి, పులివెందుల ఏరియా ఆస్పత్రిలో ఈ నియామకాలు చేపట్టారు. అయితే వీరిలో ఆరు నెలల గడువు ముగిసిన వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ లెక్కన గడువు ముగిసిన వారి జాబితాలో 11 మంది స్పెషలిస్టు మెడికల్‌ ఆఫీసర్లు, 267 మంది జనరల్‌ డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, 284 మంది స్టాఫ్‌ నర్సులు, 96 మంది అనస్తీషియా, 51 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 64 మంది ట్రైనీ నర్సులతో పాటు ఇతరులను తొలగించినట్లు సమాచారం. తొలి విడతలో 90 మంది స్టాఫ్‌ నర్సులను ఇంటికి పంపించనున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. కేసుల సంఖ్య హెచ్చుతగ్గులుగా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కాంట్రాక్ట్‌ వైద్య సిబ్బందిని తొలగించడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై డీఎంహెచవో నాగరాజును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆరు నెలల కాంట్రాక్ట్‌ గడువు ముగిసిన వారిని తొలగిస్తామన్నారు. 

Updated Date - 2021-10-24T05:39:06+05:30 IST