90 లక్షల మంది రికవరీ

ABN , First Publish Date - 2020-12-05T07:57:19+05:30 IST

దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 90 లక్షలు దాటింది. ప్రపంచంలో ఇవే అత్యధికం. 1.45 కోట్ల కేసులున్న అమెరికాలో 86 లక్షల మంది కోలుకున్నారు. భారత్‌లో మాత్రం 95.71 లక్షల కేసులకు 90 లక్షల మంది కోలుకున్నారు. దేశంలో గురువారం 36,595 మందికి వైరస్‌ సోకింది...

90 లక్షల మంది రికవరీ

  • ప్రపంచంలో భారత్‌లోనే అత్యధికం


న్యూఢిల్లీ, డిసెంబరు 4: దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 90 లక్షలు దాటింది. ప్రపంచంలో ఇవే అత్యధికం. 1.45 కోట్ల కేసులున్న అమెరికాలో 86 లక్షల మంది కోలుకున్నారు. భారత్‌లో మాత్రం 95.71 లక్షల కేసులకు 90 లక్షల మంది కోలుకున్నారు. దేశంలో గురువారం 36,595 మందికి వైరస్‌ సోకింది. 540 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం దేశంలో అత్యధిక కేసులు కేరళ (5,376)లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర(5,182 కేసులు- 115 మరణాలు), ఢిల్లీ (3,374-82 మరణాలు)లో కేసులు నిలకడగా ఉన్నా.. మృతుల సంఖ్య పెరిగింది. కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తం మిశ్రాకు కోవ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొనే వీల్లేకపోయింది. కర్ణాటకలో ఈనెల 20 నుంచి 15 రోజుల పాటు నిషేధాజ్ఞలు విధించనున్నారు.

Updated Date - 2020-12-05T07:57:19+05:30 IST