700 మీటర్ల దూరంలోనే తొమ్మిది మలుపులు.. ఈ కొండపై రోడ్డు వేసేందుకు ఎన్నేళ్లు పట్టిందంటే..

ABN , First Publish Date - 2021-12-19T21:44:08+05:30 IST

అదో మారుమూల గ్రామం. ఆ గ్రామానికి వెళ్లాలంటే ఎవరైనా హడలిపోవాల్సిందే. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిందే. కానీ ఇదంతా గతం. ఇపుడు

700 మీటర్ల దూరంలోనే తొమ్మిది మలుపులు.. ఈ కొండపై రోడ్డు వేసేందుకు ఎన్నేళ్లు పట్టిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: అదో మారుమూల గ్రామం. ఆ గ్రామానికి వెళ్లాలంటే ఎవరైనా హడలిపోవాల్సిందే. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిందే. కానీ ఇదంతా గతం. ఇపుడు ఆ ఊరు.. పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. అయితే.. ఒకప్పుడు ఆ ఊరంటే హడలిపోయేలా చేసింది.. ఇపుడు దాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చింది ఆ గ్రామానికి ఉన్న రోడ్డే. రోడ్డు ఏంటి గ్రామాన్ని పర్యటక ప్రదేశంగా మార్చింది అని అనుకుంటున్నారా. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. 



రాజస్థాన్‌లోని మారుమూల గ్రామమైన పనార్వా ఎత్తైన కొండపై ఉంటుంది. కొల్యారి అనే ప్రాంతం నుంచి పనార్వా గ్రామానికి వెళ్లేందుకు 15 సంవత్సరాల క్రితం సరైన దారి ఉండేది కాదు. ఎవరైనా పనార్వాకు వెళ్లాలంటే.. బైక్ లేద కారు మాత్రమే ఘాట్ రోడ్డులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ఎదురుగా ఏదైనా వాహనం వస్తే ప్రయాణికులకు అది అగ్నిపరీక్షే. అయితే ఇపుడు పరిస్థితులు పూర్తి మారిపోయాయి. ఆరు కిలోమీటర్ల ఘాట్ రోడ్డులో భాగంగా ఉన్న 700 మీటర్ల దారిపై ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 700 మీటర్ల దూరంలో ఏకంగా 9 మలుపులు ఉండటంతో ప్రస్తుతం ఆ దారి పర్యటక ప్రదేశంగా మారిపోయింది. దీంతో పనార్వా‌కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కాగా.. ఈ రోడ్డుకు సంబంధించిన ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. దీన్ని నిర్మించడానికి ఏకంగా రెండేళ్ల సమయం పట్టింది. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ తీసుకురావడానికి ఇబ్బందులు తలెత్తడంతో రెండేళ్లపాటు కష్టపడ్డామని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఎంతో శ్రమపడి పూర్తి చేసిన రోడ్డు.. ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా మారడంపట్ల సదరు కాంట్రక్టర్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 






Updated Date - 2021-12-19T21:44:08+05:30 IST