Abn logo
Sep 28 2021 @ 02:01AM

9 నెలల గర్భిణి.. 2 వారాల్లో డెలివరీ.. America పార్కులో దారుణం.. ఉదయాన్నే ఆ దృశ్యం చూసి షాక్ అయిన జనం

ఫ్లోరిడా: 9 నెలల గర్భిణి. మరో 2 వారాల్లో పండండి బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను కళ్లారా చూడాలని, మురిసిపోవాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఆమె కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఎవరు చేశారో..? ఎందుకు చేశారో..? కానీ శనివారం ఉదయం 6: 30 గంటలకల్లా స్థానిక పార్క్‌లో ఊపిరి లేకుండా పడి ఉంది. పార్క్‌లో నడిచేందుకు వచ్చిన వారు ఆమె మృతదేహాన్ని గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫెలీసియా జోన్స్ అలియాజ్ ఫీఫీ అనే 21 ఏళ్ల యువతి మృతదేహం శనివారం ఉదయం జాక్సన్ విల్లేలోని రివర్ వ్యూ పార్క్‌లో కనిపించింది.  ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఫీఫీ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో షాక్‌కు గురైన కుటుంబం.. మరి కొద్ది రోజుల్లో తల్లి అవుతుందని, చంటిబిడ్డతో ఇంట్లో కళకళలాడుతూ తిరుగుందని అనుకున్న తమ అమ్మాయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ అమ్మాయిని చంపిందెవరో తెలియాలని, దీనికోసం స్థానిక ప్రజలంతా ఒక్కటై సాయం చేయాలని ఫీఫీ బంధువు ఏంజెలికా విలియమ్స్ అన్నారు. అలాగే ఫీఫీ అంత్యక్రియల కోసం గో ఫండ్‌మి ద్వారా విరాళాలు కూడా సేకరిస్తున్నామని, అంతా సాయం చేయాలని కోరారు.


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...