బెంగళూరు: రాష్ట్రంలో ఉన్నతాధికారుల మార్పులు జోరందుకున్నాయి. రెండు రోజులక్రితమే 19మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చే సిన ప్రభుత్వం గురువారం 9మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. సీఐడీ ఎస్పీ రవి చెన్నణ్ణవర్‌ను మహర్షి వాల్మీకి కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. బీదర్ ఎస్పీగా కి శోర్‌బాబును, బీమా శంకర్ గుళేద్‌ను బెంగళూరు తూర్పు డీసీపీగాను, కొప్పళ ఎస్పీగా అరుణాంగ్యు గిరి, సీఐడీ ఎస్పీగా డీఎల్ నాగేశ్, కేఎ్‌సఆర్టీసీ డైరెక్టర్‌గా అబ్దుల్ వహాద్, పౌరహక్కుల డైరెక్టరేట్ ఎస్పీగా శ్రీధర్, చామరాజనగర్ ఎస్పీగా టీపీ శివకుమార్‌ను, దివ్యసారా థామ్‌సను పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
ఇవి కూడా చదవండి