9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాకు చర్యలు

ABN , First Publish Date - 2020-05-31T10:19:38+05:30 IST

రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీఎ్‌సపీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరినాథరావు

9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాకు చర్యలు

 రూ. 480 కోట్లతో అభివృద్ధి పనులు: సీఎండీ హరినాథరావు


కర్నూలు (అర్బన్‌), మే 30: రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీఎ్‌సపీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరినాథరావు తెలిపారు. శనివారం స్థానిక విద్యుత్‌ భవన్‌లో విలేఖరుల సమావేశంలో  మాట్లాడారు. ఐదు జిల్లాల్లో 3,892 ఫీడర్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 480 కోట్లు ఖర్చు చేయనుందని, ఇప్పటికే 1127 ఫీడర్లు పూర్తి అయ్యాయని అన్నారు. సబ్‌ స్టేషన్ల నిర్వహణ, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, డీటీఆర్‌ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో విద్యుత్‌ లోడును బట్టి అదనపు ట్రాన్స్‌ఫా ర్మర్లు, కొత్త కండక్టర ్ల ఏర్పాటుకు రూ.25కోట్లు కేటాయించామన్నారు. ఈసమా వేశంలో ఇన్‌చార్జి సీఈ గంగయ్య, ఎస్‌ఈ భార్గవరాముడు పాల్గొన్నారు.  


రూ.1700 కోట్లతో విద్యుత్‌ ఆధునికీకరణ: సీఎండీ 

గోస్పాడు, మే 30: రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ట్రాన్స్‌కో సీఎండీ హరినాఽథరావు అన్నారు. శనివారం దీబగుంట్ల సబ్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు పగటి పూటనే 9 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రాయలసీమతో పాటు నెల్లూరుకు విద్యుత్‌ ఆధునీకరణకు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ సుబ్రహ్మణ్యం, ఏఈలు జ్ఞాన సూర్యుడు, సురే‌షరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-31T10:19:38+05:30 IST