అప్పుల ఊబిలో రాష్ట్రం

ABN , First Publish Date - 2022-08-20T04:17:58+05:30 IST

రాష్ట్రాన్ని రూ.8లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి ఎలా వస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

అప్పుల ఊబిలో రాష్ట్రం
కర పత్రాలు అందజేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

మాజీ  మంత్రి సోమిరెడ్డి

పొదలకూరు, ఆగస్టు 19 : రాష్ట్రాన్ని రూ.8లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి ఎలా వస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.   మండలంలోని అయ్యగారిపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో సోమిరెడ్డి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఆదాయం లేక ఆదాయ వనరులను సృష్టించలేక ఇసుక, మద్యం, గ్రావెల్‌ వంటి అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తోందని విమర్శించారు. 45ఏళ్లకే పింఛను ఇస్తామని మహిళలను, ఏటా డీఎస్పీ నిర్వహిస్తామని యువతను సీఎం జగన్‌ మోసం చేశార న్నారు. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు రూ.3వేల కోట్లను నష్టపోయామన్నారు. వైసీపీ పాలనలో పోలీసులే ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని, అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అండగా నిలవడం బాధాకరమన్నారు. మంత్రి కాకాణి తన సొంత మండలం పొదలకూరుకు ఏం చేశారో చెప్పాలన్నారు. తమ హయాంలో కండలేరు ఎడమ కాలువ, లిఫ్ట్‌, మెగా వాటర్‌ ప్లాంట్‌, దక్షిణ కాలువ మరమ్మతులను పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో అయ్యగా రిపాలెం టీడీపీ నాయకులు కట్టా రవీంద్ర, సూరిపోయిన గంగయ్య, రఘు, చంద్ర, మండలాధ్యక్షుడు మస్తాన్‌బాబు, మల్లికార్జుననాయుడు, బక్కయ్యనాయుడు, రాజా, ప్రభాకర్‌, కృష్ణ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T04:17:58+05:30 IST