(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 873 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 1,27692కు చేరింది. మరణాలు 1,482 వద్ద నిలకడగా ఉన్నాయి. బాధితుల్లో ఇప్పటివరకు 1,19,790 మంది కోలుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం 6,420 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.