జిల్లాకు 87 కొత్త అంబులెన్సులు

ABN , First Publish Date - 2020-07-03T10:19:44+05:30 IST

జిల్లాకు 87 కొత్త అంబులెన్సులు వచ్చాయి. వీటిలో 104 వాహనాలు 51, 108 వాహనాలు 36 ఉన్నాయి

జిల్లాకు 87 కొత్త అంబులెన్సులు

ప్రారంభించిన డిప్యూటీ సీఎం, కలెక్టర్‌


కడప (ఎడ్యుకేషన్‌), జూలై 2: జిల్లాకు 87 కొత్త అంబులెన్సులు వచ్చాయి. వీటిలో 104 వాహనాలు 51, 108 వాహనాలు 36 ఉన్నాయి. వీటిని గురువారం కడప కోటిరెడ్డిసర్కిల్‌లో డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, కలెక్టరు హరికిరణ్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన సంచార వైద్యశాలలు, అంబులెన్స్‌ వాహనాలను ప్రారంభించడం జరిగిందన్నారు.


కలెక్టరు హరికిరణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 108, 104 అంబులెన్స్‌ వాహనాలకు సంబంధించి కంట్రోల్‌ రూము ఉందని, అదే విధంగా జిల్లా స్థాయి కంట్రోలు రూము ఏర్పాటు చేసి మానిటరింగ్‌ చేస్తామన్నారు. ఈ వాహనాలన్నీ శుక్రవారం నుంచి అన్ని మండలాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.


అడ్వాన్స్‌ లైట్‌ సపోర్టు, బేసిక్‌ లైట్‌ సపోర్టు, నియోమేటల్‌ వెంటిలేటర్‌లాంటి అత్యంత ఆధునిక పరికరాలు వీటిలో ఉంటాయన్నారు. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే సకాలంలో అంబులెన్స్‌ వచ్చి మీ ప్రాణాలు కాపాడతాయన్నారు. నియోటెల్‌ కేర్‌ అంబులెన్స్‌లు జిల్లా రెండు చొప్పున కేటాయించారని వీటితో మాతా శిశు మరణాల రేటును తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ, ఆర్డీవో మలోలా, మున్సిపల్‌ కమిషనరు లవన్న, డీఎంహెచ్‌వో ఉమాసుందరి, వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ రవీంద్రనాధరెడ్డి, 104, 108 వాహనాల జిల్లా మేనేజరు ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-03T10:19:44+05:30 IST