‘పది’ సప్లిమెంటరీలో 86.96 శాతం ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2022-08-04T05:25:03+05:30 IST

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో 86.96 శాతం మంది విద్యా ర్థులు ఉత్తీర్ణత సాధించారు.

‘పది’ సప్లిమెంటరీలో 86.96 శాతం ఉత్తీర్ణత

 రాష్ట్రంలో జిల్లాకు రెండో స్థానం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 3 :
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో 86.96 శాతం మంది విద్యా ర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 7,560 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 4,310 మంది బాలురు, 3,250 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 6,574 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 3,719 మంది బాలురు, 2,855 మంది బాలికలు ఉన్నారు. 986 మంది పరీక్ష తప్పారు. బాలుర ఉత్తీర్ణత శాతం 86.29, బాలికల ఉత్తీర్ణత శాతం 87.85 నమోదైంది.


Updated Date - 2022-08-04T05:25:03+05:30 IST