ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బామ్మ.. మీరు సూపర్ అంటూ నెటిజన్ల ప్రశంసలు!

ABN , First Publish Date - 2022-01-09T17:34:26+05:30 IST

అమెరికాకు చెందిన 86 ఏళ్ల ఓ బామ్మకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బామ్మ.. మీరు సూపర్ అంటూ నెటిజన్ల ప్రశంసలు!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన 86 ఏళ్ల ఓ బామ్మకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇచ్చిన మాటల నిలబెట్టుకున్నారంటూ ఆమెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకు బామ్మ ఏం చేశారు? ఆమె ఎరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు? అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. యూఎస్‌లో ఉండే మారిన్ ఫారెస్ట్(86) అనే వృద్ధురాలు ఇటీవల ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. డుక్ మిని మార్ట్‌కు నిత్యావసర సరకుల కోసం తరుచుగా వెళ్లే మారిన్.. అక్కడ క్యాషియర్‌గా పనిచేసే వాల్టర్ సూచన మేరకు ఆ లాటరీ టికెట్ కొన్నారు. ఇక టికెట్ కొనుగోలు చేసే సమయంలో బామ్మ.. మీరు ఈ లాటరీ ద్వారా మొదటి బహుమతి 5లక్షల డాలర్లు గెలవాలని కోరుకుంటున్నాను అని అన్నాడు వాల్టర్. దాంతో మారిన్ అతనితో ఒక మాట చెప్పింది.


ఈ లాటరీలో నేను ఎంత గెలిచిన అందులో సగం నీకు ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజాగా నిర్వహించిన డ్రాలో బామ్మ 300 డాలర్లు(రూ.22,300) గెలుచుకుంది. దాంతో అందులో సగం తీసుకుని మళ్లీ డుక్ మినీ మార్ట్‌కు వచ్చింది. ఒక కవర్‌లో 150 డాలర్లు, రెండు బెలూన్లపై వాల్టర్ పేరు రాసుకుని వచ్చింది. డబ్బుల కవర్‌తో పాటు రెండు బెలూన్లను వాల్టర్ చేతికి ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. ఈ విషయం కాస్తా సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో నెటిజన్లు బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. బామ్మ మీరు సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.  


Updated Date - 2022-01-09T17:34:26+05:30 IST