హ్యాట్సాఫ్ రతన్ టాటా... లివింగ్ లెజెండ్ అని నిరూపించుకున్నారు!

ABN , First Publish Date - 2021-01-06T00:11:01+05:30 IST

హ్యాట్సాఫ్ రతన్ టాటా... లివింగ్ లెజెండ్ అని నిరూపించుకున్నారు!

హ్యాట్సాఫ్ రతన్ టాటా... లివింగ్ లెజెండ్ అని నిరూపించుకున్నారు!

పుణే: వ్యాపారం అంటే డబ్బు మాత్రమే అని భావించే నేటి రోజుల్లో... అంతకంటే ముఖ్యమైనది మానవత్వమే అని నిరూపించారు ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా. తమ కంపెనీలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని పరామర్శించేందుకు ఆయన స్వయంగా ముంబై నుంచి పుణే వెళ్లడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 83 ఏళ్ల ఈ  వ్యాపార దిగ్గజం ఎలాంటి మీడియా హడావిడీ లేకుండా, కనీసం తన వెంట బౌన్సర్లను కూడా తీసుకెళ్లకుండా అక్కడికి వెళ్లడం విశేషం. ఇటీవల లైక్డిన్ వినియోగదారుడొకరు ఈ విషయాన్ని పోస్టు చేయడంతో.. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘‘83 ఏళ్ల లివింగ్ లెజండ్, భారత దేశంలోనే అత్యంత గొప్ప వ్యాపారవేత్త అయిన సర్ రతన్ టాటా... రెండేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న తమ మాజీ ఉద్యోగిని పరామర్శించేందుకు ముంబై నుంచి పుణేలోని ఫ్రెండ్స్ సొసైటీకి వచ్చారు. మీడియా లేదు, బౌన్సర్లు లేరు... విధేయత గల ఉద్యోగుల పట్ల కేవలం అంకితభావం మాత్రమే ఉంది. అందుకే ఆయన అంత గొప్పవారయ్యారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. డబ్బే సర్వస్వం కాదు.. కావాల్సిందల్లా గొప్ప మనిషిగా జీవించడమే... హ్యాట్సాఫ్ సర్.. మీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను...’’ అని సదరు నెటిజన్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా దీనిపై మిగతా నెటిజన్లు కూడా రతన్ టాటాను కొనియాడుతూ స్పందిస్తున్నారు. 

Updated Date - 2021-01-06T00:11:01+05:30 IST