83 శాతం మందికి తొలి డోసు పూర్తి

ABN , First Publish Date - 2021-10-23T15:44:47+05:30 IST

రాష్ట్రంలో 83 శాతం మందికి తొలి డోసు వ్యాక్సిన్‌ పూర్తి చేశామని ఐటీబీటీ, ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ పేర్కొన్నారు. మల్లేశ్వరం కబడ్డీ మైదానంలోని కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంలో శు

83 శాతం మందికి తొలి డోసు పూర్తి

                   - మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ వెల్లడి


బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో 83 శాతం మందికి తొలి డోసు వ్యాక్సిన్‌ పూర్తి చేశామని  ఐటీబీటీ, ఉన్నత విద్యా శాఖ మంత్రి  డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ పేర్కొన్నారు. మల్లేశ్వరం కబడ్డీ మైదానంలోని కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 100 కోట్ల డోసులతో దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణకు కేంద్రం తీసుకున్న చర్యలు అద్భుతమని కొనియాడారు. ఎలాంటి తారతమ్యం చూపకుండా దేశప్రజలందరికీ కేంద్రం ఉచితంగా 100 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ వేయించడం సామాన్య విషయం కాదన్నారు. ప్రభుత్వాలు మంచి పనులు చేసినప్పుడైనా ప్రతిపక్షాలు మెచ్చుకోవాలని ప్రతిదానిని రాజకీయం చేయడం సరికాదని ఆయన హితవు పలుకుతూ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్‌ను చూసి ప్రపంచంలోని అగ్రదేశాలు సైతం విస్తుపోతున్నాయన్నారు. రాష్ట్రంలో 83 శాతం మందికి అంటే 4.15 కోట్ల మందికి కొవిడ్‌ తొలి డోసు ఇవ్వడం పూర్తయిందని, 2.05 కోట్ల మంది రెండో డోసు కూడా వేయించుకున్నారని మంత్రి వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వ పటిమపై దేశ ప్రజల్లో విశ్వాసం మరింతగా పెరిగిందన్నారు. 100 కోట్ల డోసుల కోసం కేంద్ర రూ. 34,515 కోట్లు ఖర్చుచేసిందన్నారు. 100 కోట్ల డోసులు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో కోవిడ్‌ వారియర్స్‌ను సన్మానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బెంగళూరు నగర జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఎవరిని నియమించాలనేది సీఎం అభీష్టమని ఒక వేళ ఆ బాధ్యతను సీఎం తీసుకుంటే తాను ఇంకా సంతోషిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపి ఉపాధ్యక్షుడు ఎం.శంకరప్ప, బెంగళూరు ఉత్తర అధ్యక్షుడు బీ నారాయణ, బెంగళూరు సెంట్రల్‌ అధ్యక్షుడు జీ మంజునా థ్‌,  బెంగళూరు దక్షిణ అధ్యక్షుడు ఎన్‌ఆర్‌ రమే్‌ష తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2021-10-23T15:44:47+05:30 IST