Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 27 Jan 2022 12:15:18 IST

ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘83’

twitter-iconwatsapp-iconfb-icon
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 83

ఇండియన్స్ లో క్రికెట్ పై మోజు పెరగడానికి ప్రధాన కారణమైంది ‘83’ వరల్డ్ కప్. కపిల్‌దేవ్ నాయకత్వంలోని ఇండియన్ టీమ్ తొలి వరల్డ్ కప్ ను కైవసం చేసుకోడాన్ని ఎవరూ మరిచిపోలేరు.  ఆ మధురక్షణాల్ని ఇప్పటి జెనరేషన్ కు ‘83’ సినిమాతో  గుర్తుచేసే ప్రయత్నం చేశాడు బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్.  రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో జీవించగా..  ఆయన భార్య పాత్రను దీపికా పదుకొణే పోషించింది. ప్రతీ ఇండియన్ ఎంతో ఆసక్తిని కనబరిచిన ఈ సినిమా వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. అయితే కరోనా కారణంగా సరైన వసూళ్ళను దక్కించుకోలేకపోయింది ఈ సినిమా. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయిన వారు ఓటీటీలోనైనా తొందరగా చూడాలనుకున్నారు. అయితే ముందస్తు ఒప్పందం ప్రకారం ఈ సినిమా కాస్తంత లేట్ గానే ఓటీటీలోకి వస్తోంది. 


ఫిబ్రవరి 18న ‘83’ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. అయితే హిందీ వెర్షన్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ వారు భారీగా కొనుగోలు చేశారట. ఫిబ్రవరి 18న ఇటు సౌత్ లాంగ్వేజెస్ లోనూ, అటు నెట్ ఫ్లిక్స్ లోనే ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది చిత్రం. సినిమా టీజర్, ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కానీ థియేటర్స్ లో ఆశించిన రీతిలో సక్సెస్ కాలేకపోయింది. మరి ఓటీటీలోనైనా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందేమో చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement