చైనాలో 81,669 కేసులు..

ABN , First Publish Date - 2020-04-06T07:35:18+05:30 IST

కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ 30 కొత్త పాజిటివ్‌ వైరస్‌ కేసులు బయల్పడ్డాయి. ఇందులో ఐదు కేసులు స్థానికంగా వ్యాప్తిచెందినవేనని తేలింది. అలాగే కరోనా లక్షణాలున్న ఇంకో 47 కేసులు...

చైనాలో 81,669 కేసులు..

బీజింగ్‌, ఏప్రిల్‌ 5: కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ 30 కొత్త పాజిటివ్‌ వైరస్‌ కేసులు బయల్పడ్డాయి. ఇందులో ఐదు కేసులు స్థానికంగా వ్యాప్తిచెందినవేనని తేలింది. అలాగే కరోనా లక్షణాలున్న ఇంకో 47 కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా.. 700 మందికిపైగా భారతీయులు సింగపూర్‌లో చిక్కుపడ్డారు. ఈ దేశంలో మొత్తం 72 మంది భారతీయులకు కరోనా సోకగా.. వీరిలో పది మంది కోలుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని దుబాయ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంక్షలను మరింత కఠిన తరం చేసింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 


Updated Date - 2020-04-06T07:35:18+05:30 IST