ఇంజనీరింగ్‌లో 81 శాతం సీట్ల భర్తీ

ABN , First Publish Date - 2022-09-23T09:01:44+05:30 IST

ఇంజనీరింగ్‌లో 81 శాతం సీట్ల భర్తీ

ఇంజనీరింగ్‌లో 81 శాతం సీట్ల భర్తీ

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో 81.57 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద మొత్తం 1,11,864 సీట్లు ఉంటే 91,249 సీట్లు అభ్యర్థులకు కేటాయించారు. తొలి విడత సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. బ్రాంచ్‌ల వారీగా చూస్తే మొత్తం భర్తీ అయున సీట్లలో దాదాపు సగం కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లే ఉన్నాయి. సీఎ్‌సఈలో 27,261, దాని అనుబంధ బ్రాంచ్‌ల్లో 14,730 సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఈసీఈలో 20,211, ఈఈఈలో 6,086, మెకానికల్‌లో 3,728 సీట్లు, సివిల్‌లో 3,385 సీట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 23 కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి ఒక్క సీటు కూడా భర్తీ కాని కాలేజీలు ఎక్కడా లేవని అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-09-23T09:01:44+05:30 IST