24 గంటల్లో దేశవ్యాప్తంగా 8వేల కరోనా పరీక్షలు: కేంద్రం

ABN , First Publish Date - 2020-04-03T22:40:34+05:30 IST

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

24 గంటల్లో దేశవ్యాప్తంగా 8వేల కరోనా పరీక్షలు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 2301కి పెరిగాయని, 56 మంది మరణించారని పేర్కొంది. అలాగే, ఇప్పటి వరకు 156 మంది కోలుకున్నట్టు వివరించింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 423, తమిళనాడులో 309 కేసులు నమోదైనట్టు తెలిపింది. 

ఈ ఉదయం జాతిని ఉద్దేశించిన ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల లాక్‌డౌన్‌కు మద్దతిచ్చి పాటిస్తున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 5 రాత్రి 9 గంటలకు అందరూ తమ ఇళ్లలోని లైట్లను 9 నిమిషాలపాటు ఆపేసి ద్వారాలు, బాల్కనీల వద్ద దీపాలు వెలిగించాలని కోరారు. లాక్‌డౌన్ పదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈ నెల 14న లాక్‌డౌన్ ఎత్తివేతకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

Updated Date - 2020-04-03T22:40:34+05:30 IST