మళ్లీ పెళ్లి చేసుకోబోయిన 80 ఏళ్ల వృద్ధుడు.. మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు.. చివరికి అతని పరిస్థితి ఏమైందంటే?..

ABN , First Publish Date - 2022-01-11T09:55:35+05:30 IST

80 ఏళ్ల వయస్సులో పెళ్లి కోరిక కలిగిన ఒక వృద్ధుడు.. తన కోరిక తీర్చుకోవడానికి మాట్రిమోనీ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ విషయం అతని కుమారుడికి తెలిసింది. దీంతో ఇంట్లో గొడవ మొదలై...

మళ్లీ పెళ్లి చేసుకోబోయిన 80 ఏళ్ల వృద్ధుడు.. మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు.. చివరికి అతని పరిస్థితి ఏమైందంటే?..

80 ఏళ్ల వయస్సులో పెళ్లి కోరిక కలిగిన ఒక వృద్ధుడు.. తన కోరిక తీర్చుకోవడానికి మాట్రిమోనీ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ విషయం అతని కుమారుడికి తెలిసింది. దీంతో ఇంట్లో గొడవ మొదలై రక్తపాతం వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన శంకర్ రాంభావు(80) ఇటీవలె ఒక మాట్రిమోనీ బ్యూరోకి వెళ్లి తాను మళ్లీ చేసుకోదలిచానని.. దానికోసం ఒక వధువు కావాలని ప్రకటన ఇచ్చాడు. రెండు రోజుల తరువాత ఈ విషయం అతని కుమారుడు శేఖర్ రాంభావు(47)కి తెలిసింది. ఈ వయసులో పెళ్లి చేసుకోవడమేమిటని తండ్రిని శేఖర్ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో శేఖర్ తన తండ్రి తలపై రోకలి బండతో దాడి చేశాడు. 


తలకు భారీ గాయం కావడంతో శంకర్ రాంభావు అక్కడికక్కడే మరణించాడు. ఆ తరువాత శేఖర్ తన నేరాన్ని ఒప్పుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జరిగినదంతా పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.

Updated Date - 2022-01-11T09:55:35+05:30 IST