ఈ(బీమా) పాలసీ..., ప్రీమియంలో 80 % రాయితీ...

ABN , First Publish Date - 2021-02-21T23:08:35+05:30 IST

హెల్త్ సూపర్ సేవర్ పేరుతో ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సురెన్స్ఎఫ్‌జీఐఐ) కొత్త వైద్య బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ వివరాలిలా ఉన్నాయి.

ఈ(బీమా) పాలసీ..., ప్రీమియంలో 80 % రాయితీ...

ముంబై : హెల్త్ సూపర్ సేవర్ పేరుతో ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సురెెన్స్(ఎఫ్‌జీఐఐ) కొత్త వైద్య బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ వివరాలిలా ఉన్నాయి. ఇది అమల్లోకి వచ్చిన అనంతరం... మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఎలాంటి క్లెయిమ్ చేసుకోనిపక్షంలో... తర్వాతి సంవత్సరాల్లో చెల్లించే ప్రీమియంలో 80 శాతం వరకు తగ్గింపును పొందగలగడం దీని విశేషం. పాలసీలో రెండు వేరియంట్లున్నాయి.


మొదటి ఏడాది క్లెయిమ్ చేయకపోతే ఆ తర్వాతి ఏడాది అప్లికెబుల్ ప్రీమియంలో 80 శాతం రాయితీ ఉంటుంది. ఇక... రెండో దానిని మొదటి రెండేళ్లలో క్లెయిమ్ చేయకుంటే తర్వాతి రెండేళ్లలో 80 శాతం రాయితీ ఉంటుంది. లేదంటే మొదటి క్లెయిమ్ చేసే వరకు కొనసాగుతుంది.


కస్టమర్లను పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ ఆకర్షణీయ ఆఫర్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. హెల్త్ సూపర్ సేవర్ పాలసీ మొదటి సంవత్సరం ఎలాంటి క్లెయిమ్ చేయకుంటే రెండు, మూడో సంవత్సరాలకు సంబంధించి... పునరుద్ధరణ ప్రీమియంలలో 80 శాతం తగ్గింపునందిస్తుందని ఎఫ్జీఐఐ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనూప్ రావ్ తెలిపారు. 

Updated Date - 2021-02-21T23:08:35+05:30 IST