Sep 27 2021 @ 19:13PM

నా ప్రేమకు ఎనిమిదేళ్లు..Fahadh Faasil భార్య నజ్రియా పోస్ట్‌కు నెటిజన్ల రియాక్షన్ అదుర్స్

బెంగళూరు: అభినయం, ఆకట్టుకునే కళ్లతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి నజ్రియా నజీమ్. ఫహద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం తన పేరును నజ్రియా ఫహద్‌గా మార్చుకున్నారు. వివాహం చేసుకున్న అనంతరం కొన్ని ఏళ్లు గ్యాప్ తీసుకుని విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రాజారాణి చిత్రంలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ చిత్రంలో ఆమె కీర్తన పాత్రలో నటించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా 2013 సెప్టెంబరు 27న విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నజ్రియా చిత్రానికి సంబంధించిన ఒక సీక్వెన్స్‌ను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు.  ఆ సినిమా సంగతులను గుర్తు చేసుకున్నారు. ఆ పోస్టుకు నెటిజన్లు ఎమోజీలతో తమ స్పందనను తెలియజేశారు.


‘‘ రాజారాణి విడుదలై నేటితో 8ఏళ్లు పూర్తైంది. కీర్తన పాత్రకు 8 ఏళ్లు. నాకు ఇష్టమైన పాత్ర ఇది. 8 ఇయర్స్ ఆఫ్ బ్రదర్ లవ్ ’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫాక్స్‌స్టార్‌‌‌స్టూడియోస్ తో కలిసి ఏఆర్.మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్.రెహమాన్ మేనల్లుడు జివి.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. ఆర్య, నయనతార, సంతానం, జై, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు.