Advertisement
Advertisement
Abn logo
Advertisement

8 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా..

అమరావతి: ప్రకాశం బ్యారేజ్ వద్ద స్టోరేజ్ లేకపోవడంతో 8 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోయిందని ఏపీ ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు తెలిపారు. గత 45 రోజులుగా తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి చేయకూడదని తెలంగాణకు బోర్డు స్పష్టంగా చెప్పిందన్నారు. అయినా తెలంగాణ అక్రమంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలంలో 30.38 టీఎంసీల ఇన్‌ఫ్లో ఉంటే 29.82 టీఎంసీలను విద్యుత్ ఉత్పత్తికే వినియోగించారని ఆయన తెలిపారు. దీంతో పోతిరెడ్డిపాడుకు నీళ్లవ్వలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. 

Advertisement
Advertisement