హైదరాబాద్‌లో ఎనిమిది మంది అదృశ్యం

ABN , First Publish Date - 2021-03-28T15:59:11+05:30 IST

నగరం‌లోని బంజారాహిల్స్‌లో ఇద్దరు మైనర్లు ఆదృశ్యమయ్యారు.

హైదరాబాద్‌లో ఎనిమిది మంది అదృశ్యం

హైదరాబాద్ : నగరం‌లోని బంజారాహిల్స్‌లో ఇద్దరు మైనర్లు ఆదృశ్యమయ్యారు. బిహార్‌కు చెందిన మహేష్‌ కుమార్‌ అడ్డా కూలి. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లోని ఎన్‌బీటీనగర్‌లో సోదరుడు రాహుల్‌కుమార్‌ రాయ్‌తో కలిసి ఉంటున్నాడు. రాహుల్‌ కూడా పనికి వెళుతుంటాడు. వీరి ఇంటి పక్కనే ఉండే రాధేకుమార్‌ రాయ్‌తో పది రోజుల క్రితం రాహుల్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరుచూ కలిసి మాట్లాడుకునే వారు. ఈ నెల 25న కూడా రాధేకుమార్‌ ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఏం చెప్పకుండా బయటకు వెళ్లారు. ఆ తరువాత తిరిగి రాలేదు. దీంతో మహేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


డబ్బు కోసం నగరానికి వచ్చి..

డబ్బు కోసం నగరానికి వచ్చి తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన బి.శ్రీనివాస్‌ లారీ డ్రైవర్‌. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోదరి వివాహం చేసేందుకు డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాడు. భార్య వసంతను కూడా డబ్బులు సర్దుబాటుకు ప్రయత్నం చేయమని చెప్పాడు. వసంత కుమారుడు లోహిత్‌, కుమార్తె ప్రణతితో కలిసి గతంలో పనిచేసిన యజమాని వద్దకు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 10కి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


డబ్బులు ఇచ్చి వస్తానని.. 

డబ్బు కట్టి వస్తానని బయటకు వెళ్లిన యువకుడు ఆదృశ్యమయ్యాడు. ఫిలింనగర్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పద్మావతి గృహిణి. తన సోదరికి డబ్బులు ఇచ్చేది ఉండగా  బ్యాంకు నుంచి రూ.లక్షా 50వేల రూపాయలు డ్రా చేసుకుని రమ్మని కుమారుడు నర్సింహను పంపించింది ఇంటి నుంచి వెళ్లిన నర్సింహ తిరిగి రాలేదు. పద్మావతి   ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


తల్లీకూతురు..

తల్లీకూతురు అదృశ్యమైన ఘట న లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. లాలాగూడ శాంతినగర్‌కు చెందిన శేరీన్‌ (25) తన కుమార్తె నస్త్రీన్‌(3)తో ఈ నెల 15న నాచారానికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. భర్త మహ్మద్‌ మహబూబ్‌ వెంటనే లాలాగూడ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-28T15:59:11+05:30 IST