Congress లో చేరిన 8 మంది మాజీ MLA లు

ABN , First Publish Date - 2022-05-24T16:49:25+05:30 IST

ప్రజల భావోద్వేగాలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాయని చెప్పడానికి ఉత్తమ ఉదాహరణ. భవిష్యత్‌కు కాంగ్రెస్ మాత్రమే ఏకైక ఆధారమని ప్రజల నుంచి బలమైన సంకేతాలు వస్తున్నాయి. తొందరలోనే పార్టీ పునర్‌వైభవం తీసుకుంటుంది. హర్యానా ప్రజల నమ్మకాల్ని కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది..

Congress లో చేరిన 8 మంది మాజీ MLA లు

న్యూఢిల్లీ: హర్యానా కాంగ్రెస్‌కు పెద్ద బూస్ట్ లభించింది. ఏకంగా ఒకేసారి ఎనిమిది మంది మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత భూపిందర్ సింగ్ హూడా ఆధ్వర్యంలో వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకుని సభ్యత్వం తీసుకున్నారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయి భన్ వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. చేరినవారు వరుసగా శర్ద రాథోడ్, రాం నివాస్ ఘోరెలా, నరేష్ సెల్వాల్, పర్మిందర్ సింగ్ ధుల్, జిలే రాం శర్మ, రాకేష్ కంబోజ్, రాజ్‌కుమార్ వాల్మీకి, సుభాష్ చౌదరి అని కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.


పార్టీ చేరిక అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో భూపిందర్ సింగ్ మాట్లాడుతూ ‘‘ప్రజల భావోద్వేగాలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాయని చెప్పడానికి ఉత్తమ ఉదాహరణ. భవిష్యత్‌కు కాంగ్రెస్ మాత్రమే ఏకైక ఆధారమని ప్రజల నుంచి బలమైన సంకేతాలు వస్తున్నాయి. తొందరలోనే పార్టీ పునర్‌వైభవం తీసుకుంటుంది. హర్యానా ప్రజల నమ్మకాల్ని కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది’’ అని అన్నారు. ఇక హర్యానా కాంగ్రెస్ అధినేత ఉదయ్ భన్ మాట్లాడుతూ ‘‘కొత్తగా చేరిన వారిలో అన్ని వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. పైగా వీరంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. అన్ని వర్గాల, ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఉందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది’’ అని అన్నారు.

Updated Date - 2022-05-24T16:49:25+05:30 IST