అమెరికా మ్యూజిక్ ఫెస్టివల్‌లో తొక్కిసలాట.. 8 మంది మృతి

ABN , First Publish Date - 2021-11-06T21:05:43+05:30 IST

అమెరికా మ్యూజిక్ ఫెస్టివల్‌లో విషాదం చోటుచేసుకుంది. హోస్టన్‌లో నిన్న నిర్వహించిన ఆస్ట్రోవరల్డడ్ మ్యూజిక్

అమెరికా మ్యూజిక్ ఫెస్టివల్‌లో తొక్కిసలాట.. 8 మంది మృతి

హోస్టన్: అమెరికా మ్యూజిక్ ఫెస్టివల్‌లో విషాదం చోటుచేసుకుంది. హోస్టన్‌లో నిన్న నిర్వహించిన ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ ఓపెనింగ్ నైట్‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా వందలాదిమంది గాయపడ్డారు. రాత్రి 9, 9:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు హోస్టన్ అగ్నిమాపక అధికారి శామ్యూల్ పెనా తెలిపారు.


జనం స్టేజీ వైపునకు చొచ్చుకెళ్లేందుకు నెట్టుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టు చెప్పారు. తీవ్రంగా గాయపడిన 17 మందిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో 11 మంది గుండెపోటుకు గురైనట్టు అధికారులు తెలిపారు. ర్యాపర్ ట్రావిస్ స్కాట్ సారథ్యంలో రెండు రోజులపాటు ఈ మ్యూజిక్ ఈవెంట్ జరగాల్సి ఉంది. మొత్తం 50 వేల మంది ఈ షోకు హాజరుకావాల్సి ఉంది. అయితే, తొలి రోజు తొక్కిసలాట కారణంగా రెండో రోజు షోను రద్దు చేశారు. 

Updated Date - 2021-11-06T21:05:43+05:30 IST