Abn logo
May 6 2021 @ 00:54AM

7న సీఎంగా రంగసామి ప్రమాణ స్వీకారం

యానాం, మే 5: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఈనెల7వ తేదీన రంగసామి  ప్రమాణ స్వీకారం  చేయనున్నారు. బీజేపీకి రెండు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌, పార్లమెంటనీ సెక్రటరితో పాటు విప్‌ పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు సమాచారం. ముఖ్యమంత్రి పదవితో పాటు  స్పీకర్‌, ఇతర మంత్రులను ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు కేటాయించినట్టు తెలిసింది. శాఖల కేటాయింపు తేలిన తర్వాత  మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రిగా రంగసామి శుక్రవారం  ప్రమాణస్వీకారం  చేయనున్న నేపధ్యంలో మల్లాడి ఇంటి వద్ద రంగసామి, మల్లాడి అభిమానులు సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement