Abn logo
Oct 17 2021 @ 01:00AM

సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యం : మేయర్‌

వాహనాలను ప్రారంభిస్తున్న మేయర్‌

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, అక్టోబరు 16 : సంపూర్ణ పారిశుధ్యమే సీఎం జగ న్మోహన్‌ రెడ్డి లక్ష్యమని నగర మేయర్‌ షేక్‌ నూర్జ హాన్‌ పెదబాబు అన్నారు. క్లీన్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో భాగంగా ప్రభు త్వం నగర పాలక సంస్థలకు కేటాయించిన 79 చెత్త సేకరణ వాహనాలను శుక్రవారం మేయర్‌ నూర్జహాన్‌  ప్రారంభించి మాట్లాడుతూ  ప్రతి రోజు తమ ఇళ్ళల్లోని పొడి, తడి చెత్తను వేర్వేరుగా నగర పాలక సిబ్బందికి అందించి ప్రజలు సహకరించాలన్నారు.  ఎమ్మెల్సీ సాబ్జీ, డిప్యూటీ మేయర్లు  శ్రీనివాస్‌, ఎన్‌. సుఽధీర్‌బాబు, కమిషనర్‌ డి. చంద్రశేఖర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.