Abn logo
Apr 17 2021 @ 19:36PM

పశ్చిమబెంగాల్ 5వ విడత పోలింగ్ 78.36 శాతం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. చెదురు మదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. 78.36 శాతం పోలింగ్ నమోదైంది. జల్‌పాయ్‌గురి, కలింపాంగ్, డార్జిలింగ్, నడియాలో ఒక సెగ్మెంట్, నార్త్ 24 పరగణాలు, పూర్బ బర్దమాన్ జిల్లాల్లోని 45 నియోజక వర్గాల్లో శనివారం పోలింగ్ జరిగింది. 319 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీపడగా, వీరిలో 39 మంది మహిళలు ఉన్నారు. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా నెలకొంది. కాంగ్రెస్-వామపక్ష కూటమి సైతం తలపడుతోంది.

ఐదో విడతలో పోలింగ్ జరిగిన 45 నియోజకవర్గాల్లో మయినాగురిలో అత్యధికంగా 85.65 శాతం పోలింగ్ నమోదైంది. మటిగర-నక్సల్బరి నియోజకవర్గంలో 81.65 శాతం, బరసత్‌లో 77.71 శాంత, బిధాన్‌ నగర్‌లో 61.10 శాతం, సిలిగురిలో 74.83 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఆరో విడత పోలింగ్ 43 నియోజకవర్గాల్లో ఈనెల 22న జరుగనుంది.


Advertisement
Advertisement