వైరల్ వీడియో: తాతే అనుకుంటే.. తాట తీశాడు..!

ABN , First Publish Date - 2020-02-20T00:28:25+05:30 IST

వృద్ధుడే కదా ఏం చేస్తాడులే..సులువుగా డబ్బు లాక్కుని పారిపోదామనుకున్నాడో దుండగుడు. కానీ తాత రంగంలోకి దిగేసరికి తోకముడిచిపారిపోయాడు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సా

వైరల్ వీడియో: తాతే అనుకుంటే.. తాట తీశాడు..!

న్యూఢిల్లీ: వృద్ధుడే కదా ఏం చేస్తాడులే..సులువుగా డబ్బు లాక్కుని పారిపోదామనుకున్నాడో దుండగుడు. కానీ తాత రంగంలోకి దిగేసరికి తోకముడిచి పారిపోయాడు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సారాంశం. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడు ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేందుకు కార్డిఫ్ ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద కారు ఆపాడు. ఏటీఎం నుంచి నగదు తీసుకుని, తిరిగి కారువద్దకు వచ్చే సమయంలో హఠాత్తుగా.. ఓ దుండగుడు వృద్ధుడి దగ్గరకు వచ్చి డబ్బు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ వృద్ధుడు, దుండగుడిపై పిడిగుద్దులు కురిపిస్తూ రెచ్చిపోయాడు. తగ్గేదేలేదంటూ పంచ్‌ విసిరాడు. తాత ఈ రేంజ్‌లో తిరగబడతాడని ఊహించని దొంగ చివరికి తొకముడిచి తుర్రుమన్నాడు. సీసీటీవీ కెమరా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. వృద్ధుడ్ని ప్రశంసిస్తూ కామెంట్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-02-20T00:28:25+05:30 IST